Begin typing your search above and press return to search.
ఫీలవ్వాల్సిన సందర్భాలే లేవు -త్రిష
By: Tupaki Desk | 24 Oct 2015 3:30 PM GMTలాంగ్ జర్నీ.. హీరోయిన్ గా సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించడమంటే మాటలు కాదు. చాలామంది ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. మరికొంతమంది కొన్నేళ్ల తర్వాత కనిపించకుండా పోతారు. కానీ అతికొద్ది మంది మాత్రమే దశాబ్దానికి పైగా హీరోయిన్ గా కెరీర్ కొనసాగించగలుగుతారు. అలా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్నవారిలో ప్రస్తుతం త్రిషను చెప్పుకోవాలి. ఇప్పుడున్న హీరోయిన్స్ లో సీనియర్ నటీమణిగా త్రిషనే చెప్పాలి. ఇంతకాలం కెరీర్ కొనసాగాలంటే.. ట్యాలెంట్ ఉండడంతోపాటు.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతోంది త్రిష. వీటితోపాటే కొంత అదృష్టం కూడా కలిసి రావలని తేల్చేసిందీ అమ్మడు.
"నా కెరీర్ ని ఒకసారి వెను తిరిగి చూసుకుంటే.. ఈ సినిమాలో ఎందుకు నటించాను అని ఫీలవ్వాల్సిన సందర్భం ఒక్కటి కూడా లేదు. రాశి కంటే వాసిని నమ్ముకోవడమే దీనికి కారణం. నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టిన అంశం ఇదే అని భావిస్తాను" అంటోంది త్రిష. సక్సెస్ అవుతాయని భావించి కష్టపడి చేసిన కొన్ని సినిమాలు పల్టీ కొట్టాయని, అయితే.. మెల్లగా వాటిని మర్చిపోయానంటోంది. సినిమాల నుంచి దూరంగా వెళ్లాల్సొచ్చిన టైం వచ్చిందని చాలాసార్లు అనిపించదట అమ్మడికి. అలాంటి సమయంలో గాంబ్లర్ - విన్నయ్ తండి వరువాయ లాంటి అద్భుతమైన మూవీస్ రావడంతో.. కెరీర్ కంటిన్యూ చేశానని చెప్పిందీ భామ. జీవితంలో ఒడిదుడుకులు సహజమే అయినా.. ముందుకు సాగాలనే ఆలోచనతోనే అడుగులేశానంటోంది.
ఒకానొక సమయంలో తెలుగు - తమిళ్ చిత్రాల్లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోయింది త్రిష. ఇంకా చెప్పాలంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో తప్ప.. చిరంజీవితో సహా టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ.. కలిసి నటించిన రికార్డ్ ఈమెది. బహుశా.. ఇప్పట్లో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం కూడా కష్టం. ఇంతకాలం నటించాక కూడా.. ఇంకా తనను హీరోయిన్ గా చూడాలనుకునే అభిమానులుండడమే తన సక్సెస్ కి నిదర్శనం అంటోంది త్రిష. కరెక్టే కదూ.