Begin typing your search above and press return to search.

త్రిష కూడా ట్యాగేసింది

By:  Tupaki Desk   |   23 Jan 2016 3:30 AM GMT
త్రిష కూడా ట్యాగేసింది
X
మీరు చదివినది స్పెల్లింగ్ మిస్టేక్ ఏమీ కాదు.. నిజంగానే త్రిష ట్యాగ్ వేసింది. అది కూడా తన సినిమాపైనే. అరణ్మణై2 చిత్రాన్ని ప్రమోషన్ చేయడం త్రిష తెగ ప్రచారం చేసేస్తోంది. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా వీలైనంతగా పబ్లిసిటీ చేసి పెడుతోంది. తన ట్విట్టర్ అకౌంట్ ని అడ్డం పెట్టుకుని సినిమాకి పబ్లిసిటీ చేస్తోంది.

సర్లెండి.. ఆమె అకౌంట్ ఆమె ఇష్టం.. ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఆ సినిమా ప్రచారానికి ఈమె ఎంచుకున్న రూట్ ఆశ్చర్యకరంగా ఉంది. #Trish51 (త్రిష52) అంటూ ఓ ట్యాగ్ పెట్టి ప్రచారం చేసేస్తోంది. అంటే త్రిష నటించిన 52వ సినిమా అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఇలా తన సినిమాకి తనే ఓ ట్యాగ్ యాడ్ చేసుకుని పబ్లిసిటీ చేయడమే కాకుండా.. ఏకంగా లేడీ సూపర్ స్టార్ అని కూడా వేసేసుకోవడం మరింత ఆశ్చర్యకరం. హీరోయిన్లు 50 సినిమాలు చేయడం రికార్డే కానీ.. మరీ 50కి పైగా సినిమాలు చేశాను కాబట్టి లేడీ సూపర్ స్టార్ అనాలంటే జనాలకు కాస్త ఇబ్బంది కరమైన విషయమే. ఏమైనా ఇప్పుడు త్రిష హ్యాట్ ట్యాగులు ఆన్ లైన్ లో బాగానే చక్కర్లు కొడుతున్నాయి.

ఈ మధ్య ఇలా హ్యాష్ ట్యాగుల ట్రెండ్ బాగానే పెరిగింది. మొన్నటికి మొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ చిత్రానికి కూడా ఇలాగే చేశారు. ఈ మూవీకి చివరివరకూ టైటిల్ సెట్ చేయకపోవడంతో, #RC9 అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. కోలీవుడ్ హీరో విజయ్ సినిమాలకు కూడా తల పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ నడుస్తూంటుంది. సినిమా వాళ్లు ట్రెండ్ సెట్ చేయడమే కాదు.. పక్కాగా ఫాలో అయిపోతారు కూడా.