Begin typing your search above and press return to search.
త్రిషకు కొత్తగా ఈ మోజేంటి?
By: Tupaki Desk | 12 Nov 2017 10:42 AM GMTహీరోయిన్ గా త్రిష కెరీర్ నాలుగైదేళ్ల కిందటే ముగిసిపోయినట్లుగా కనిపించింది. కానీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ఆమె మంచి మంచి అవకాశాలందుకుని బిజీ హీరోయిన్ గా సాగిపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలుండటం విశేషం. అందులో ‘గర్జనై’ కూడా ఒకటి. ‘నాయకి’ తర్వాత త్రిష నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇది కూడా ఉంది.
ఈ చిత్రంలో త్రిష వీర లెవెల్లో యాక్షన్ కూడా పండించపోతోందట. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఆమె ఈ సినిమా కోసం భారీ ఫైట్లు చేసిందట. ఆ సందర్భంగా త్రిష ఒరిజినల్ విన్యాసాలు చేసిందట. బాడీ డబుల్ ఉపయోగించడానికి కూడా అంగీకరించకుండా తనే సొంతంగా రిస్కీ ఫైట్లు చేసిందట త్రిష. చిత్ర బృందం డూప్ సాయం తీసుకుందామని అన్నా కూడా త్రిష అంగీకరించలేదని.. ఎంతో కష్టపడి రిహార్సల్స్ చేసి తనే ఈ ఫైట్లన్నీ ఒరిజినల్ గా చేయాలని పట్టుబట్టిందట.
తన పోటీదారు నయనతార లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న నేపథ్యంలో తాను కూడా అలాంటి ఇమేజ్ తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా త్రిష ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ 35 ఏళ్లకు చేరవవుతున్న దశలో త్రిషకు ఇలాంటి ఫీట్లు అవసరమా అని కోలీవుడ్ జనాలు అంటున్నారు. త్రిష ప్రస్తుతం ‘గర్జనై’తో పాటు ‘మోహిని’.. ‘హేయ్ జూడ్’.. ‘98’ సినిమాల్లో నటిస్తోంది.