Begin typing your search above and press return to search.

ప‌డ‌మ‌టి తీరంలో త్రిషా రాగం

By:  Tupaki Desk   |   28 Dec 2015 7:30 AM GMT
ప‌డ‌మ‌టి తీరంలో త్రిషా రాగం
X
ఈ ఏడాది త్రిష జీవితంలో ఎంతో కీల‌క‌మైన‌ది. వ‌రుణ్‌ మ‌ణియ‌న్‌ తో పెళ్లి వ్య‌వ‌హారం చెడినా.. కెరీర్ ప‌రంగా ఎంతో బిజీ అయిపోయింది. కొన్ని గొడ‌వ‌ల‌తో పెళ్లి ఆగిపోయింది. అయినా ఏమాత్రం నిరాశ‌ప‌డ‌కుండా, భంగ‌పాటుకు త‌ల వంచ‌క త‌న‌లోని చిలౌట్ యాటిట్యూడ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ప్ర‌పంచానికి అర్థ‌మ‌య్యేలా చెప్పింది. తెలుగు - త‌మిళ్ - క‌న్న‌డ భాష‌ల్లో అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టించేసింది. చ‌క్క‌ని విజ‌యాలు అందుకుంది. అయితే ఇలాంటి ఏడాదిని చివ‌రి నిమిషంలో కూడా విడిచిపెట్ట‌కూడ‌ద‌నుకున్న‌ట్టుంది. అందుకే ఏకంగా అమెరికా వెళ్లిపోయింది. ఈ ట్రిప్ చాలా లాంగ్ ట్రిప్‌. ఫుల్లుగా ఎంజాయ్ చేసే ట్రిప్‌.

ఇప్ప‌టికే క్రిస్ మ‌స్ సంబ‌రాలు అమెరికాలోనే చేసుకుంది. అమెరికా సూదూర తీరంలో.. ప‌డ‌మ‌టి తీరంలో చిలౌట్ ప్లాన్ వేసుకున్నా. కొద్దిమంది స్నేహితుల‌తో క‌లిసి ఇక్క‌డికి వచ్చాను అని చెప్పింది త్రిష‌. వేగాస్ సిటీలో గ్రాండ్ కాన్య‌న్‌ - నాపా వేలీ వంటి ప్లేసెస్‌ ని తిరిగి ఎంజాయ్ చేశాం. స్కైయింగ్‌ - స్నోబోర్డ్ లెస్స‌న్స్ నేర్చుకున్నాం. ఇవ‌న్నీ అడ్వెంచ‌ర్ స్పోర్ట్ కి సంబంధించిన విష‌యాలు. వెరీ ఇంట్రెస్టింగ్‌. ఇక కొత్తేఏడాది సంబ‌రాల కోసం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల‌నుకుంటున్నాం. అక్క‌డే డిసెంబ‌ర్ 31 రాత్రి సంబ‌రాలు చేసుకుంటాం.. అంటూ త్రిష చెప్పింది. ఏడాదంతా సినిమాలు చేస్తూ బాగా అల‌సిపోయాను. అందుకే రిమ్మ‌తెగులొచ్చిన‌ట్టుంది. వీటినుంచి ఎలాగైనా బైట‌ప‌డాలి కాబ‌ట్టే రిలాక్సేష‌న్ ప్లానింగ్ గ్రాండ్‌ గా చేసుకున్నా. సంబ‌రాలు అంబ‌రాన్ని తాకాలి. ఒళ్లంత తుళ్లింత కావాలి. గుండెల్లో గుబులంతా తీరాలి.. అంటూ త‌న ప్లానింగుని చెప్పింది అందాల త్రిష‌. వాటే ప్లానింగ్ బేబి.