Begin typing your search above and press return to search.
మల్లెల బాట కాదు, ముళ్ల బాట
By: Tupaki Desk | 24 July 2015 8:07 PM GMTకథానాయికలు రాజకీయాల్లో రాణించడం అంటే అంత ఆషామాషీనా? రాజకీయాలు అందరికీ రాచబాటలా? పట్టు పానుపులు, తూణీరాలు, హంసతూలికా తల్పాలు వేసి రాకుమారికి సేవలు చేసినట్టు చేయడానికి ఇదేమీ రాణీ విలాసం కాదు కదా. అయినా హీరోయిన్లంతా అటువైపే ఎందుకు వెళుతున్నట్టు? ఇంతకాలంగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన త్రిష ఇక రాజకీయాల్లోకి వెళ్లి ఏం ఒరగబెట్టేద్దామని? ఇలాంటి ప్రశ్నలెన్నో ఈ పొద్దు ఉదయించాయి.
త్రిష రాజకీయాల్లోకి వస్తోంది. జయలలితకు వారసురాలి గా పగ్గాలు చేపడుతోంది. అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకుంటోంది అన్న వార్త విన్నప్పట్నుంచి బోలెడన్ని యక్ష ప్రశ్నలు మనసులోనే మెలితిరిగిపోయాయి. అసలు రాజకీయాల్లోకి వచ్చిన ఎందరో కథానాయికలు అక్కడ ఎన్నిటినో భరించాల్సొచ్చింది. ఇదొక రొచ్చు. బూతు పురాణాల కిల్లా. భడభాగ్నిని గుండెల్లోకి గుచ్చేసే కొర్రు. ఇదో రఫ్ అండ్ ఠఫ్ గేమ్. ఇలాంటి చోట సెన్సిటివ్ ఆలోచనలు ఉండే నాయికామణులు ఎలా రాణిస్తారు? రౌడీయిజానికి రాజకీయానికి లంకె ఉన్న చోట ఎలా ఎదురీదుతారు?
రోజా, జయసుధ, జయప్రద వంటివారే రాజకీయాల్లోకి వచ్చి ఏమీ చేయలేకపోయారు. ఏవో కొన్ని పదవులు వెలగబెట్టినా వాళ్లంతా ప్రజలకు చేయాలనుకున్న సేవలు చేయగలిగారా? సికిందరాబాద్ ఎమ్మెల్యే గా ఎన్నికైన జయసుధ సైతం అసలు ప్రజాసేవ చేయాలనుకున్నా ఇక్కడ చేయనివ్వరు అని వాపోయారు. అంతెందుకు కళ్లముందే ఓ ప్రత్యక్ష సాక్ష్యం. అప్పట్లో యువకథానాయిక కన్నడ నటి రమ్య అతి పిన్న వయసులో ఎంపీ అయ్యి రికార్డుల కెక్కింది. కానీ ఇప్పుడు ఏమయ్యింది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయాక ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు కథానాయికగా అవకాశాల కోసం పరిశ్రమలో చెయ్యి చాస్తోందని చెబుతున్నారు.
ఇదొక రణరంగం. మల్లెల బాట కాదు, ముళ్ల పానుపు. దిగారో గుండెల నిండా ముళ్లు దిగుతాయి. అందుకే ఇక్కడికి వచ్చే ముందే బాగా ఆలోచించుకోవాలి. ఒకసారి రౌడీయిజంలోకి, రాజకీయంలోకి వచ్చాక అంటిన మకిలి జీవితాంతం వదిలిపోదు. తిడితే పడాలి. కొట్టినా ఎదురెళ్లాలి. రాళ్ల వర్షానికి తల అడ్డు పెట్టాలి. ఇంత చేసే సాహసం త్రిష కు ఉందంటారా?