Begin typing your search above and press return to search.

వెలుగులు వచ్చాక చీకట్లో హీరోయిన్

By:  Tupaki Desk   |   10 Nov 2016 3:30 PM GMT
వెలుగులు వచ్చాక చీకట్లో హీరోయిన్
X
త్రిష కెరీర్ ఈ మధ్య ఫుల్ స్పీడ్ అందుకుంది. చెన్నై బ్యూటీ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు కూడా లేనన్ని సినిమాలు.. ఒకేసారి చేతికొచ్చాయి. ఈ రేంజ్ లో డస్కీ బ్యూటీ బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఒకేసారి అరడజన్ ప్రాజెక్టులకు కమిట్ అవుతానని కనీసం త్రిష కూడా ఓ ఏడాది క్రితం ఊహించి ఉండదు.

మరి ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్నపుడు చీకట్లు ఎందుకు అనే డౌట్ రావడం సహజం. ఈ చీకట్లు ఓ ఫోటో కోసం ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసిన థీమ్ లెండి. అంత చీకటిలో కూడా త్రిష అందాలు ఏ రేంజ్ లో మెరుస్తున్నాయో చూశారా.. మనసంతా ఆనందం నిండిపోతే ఇలాగే వెలుగులు వస్తాయ్ మరి. జస్ట్ నైట్ వేర్ ని మాత్రమే ధరించింది.. చేతిలో కూల్ డ్రింక్ పట్టుకుని.. ఏసీ రూమ్ విండో లోంచి ఎదురుగుండా ఉన్న ప్రపంచాన్ని కళ్లజోడు పెట్టుకుని చూస్తే ఎలా ఉంటుంది? అద్దిరిపోదూ.. అందుకే త్రిష అదే పనిలో ఉంది.

అమ్మడి మనసులో ఎంత ఆనందం ఉందో కానీ.. ఈ ఫోటోలు చూస్తుంటే మాత్రం.. అభిమానుల కళ్లలో ఓ వంద కొవ్వొత్తులు వెలగడం అయితే ఖాయం. గ్లామర్ విషయంలో హద్దులు సరిహద్దులను మార్చుకుంటూ త్రిష ఈ మధ్య బాగా ఛేంజ్ చూపిస్తోందనే కామెంట్స్ బాగానే వినిపిస్తున్నాయ్. ఈ భామకి కావాల్సింది కూడా అదే కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/