Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: డాల్ఫిన్ తో ఫన్..హీరోయిన్ కు ట్రోల్
By: Tupaki Desk | 18 Sep 2018 6:15 AM GMTఈ నెటిజనులు ఉన్నారే.. అయిందానికి కానిదానికి తప్పంటారు. తుమ్మితే తప్పంటారు... లూజ్ షర్ట్ వేసుకుంటే తప్పు.. క్లీవేజ్ షో చేస్తే తప్పు. ఇక ఎవరైనా డాల్ఫిన్ ను ముద్దు పెడితే.. ఆ డాల్ఫిన్ తో ముద్దు పెట్టించుకుంటే..దానివల్ల పెద్ద ప్రళయం వస్తుంది. పాపం త్రిష సెలెబ్రిటీనే కానీ నెటిజనులగురించి రీసెర్చ్ ఏమీ చెయ్యలేదుకదా అందుకే రీసెంట్ గా కాస్త ట్రోలింగ్ బారిన పడింది.
ఇంతకీ ఏం జరిగిందంటే త్రిష రీసెంట్ గా ఒక డాల్ఫిన్ పూల్ లో దిగింది. ఒక డాల్ఫిన్ ను ప్రేమగా నిమిరింది. దాన్ని ముద్దుపెట్టుకుంది. ఇక అది కూడా త్రిషకు ఒక ముద్దిచ్చింది. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. దానికి "లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను నమ్మండి" అనే క్యాప్షన్ ఇచ్చింది. చాలామందికి ఆ ఫోటోలు తెగ నచ్చాయి. క్యూట్ అని బ్యూటిఫుల్ అని మెచ్చుకున్నారు. కానీ ప్రతి దానిలో నెగెటివ్ ను చూసే కొందరు ఉంటారుగా వాళ్ళు గట్టిగా త్రిషను తగులుకున్నారు.
"నువ్వు యానిమల్ లవర్(టెంపర్ లో ఎన్టీఆర్ డైలాగ్ ను గుర్తు చేసుకోవద్దు బాబోయ్) అంటావుగా మరి ఇలా బంధించి.. ఫ్రీడమ్ లేకుండా చేసిన వాతావరణంలో ఉన్న డాల్పిన్ తో ఫోటోలు దిగడం ఎలా చేస్తావు.. అదేనా జంతుప్రేమ అంటే.. నీదంతా హిపోక్రసీ.." అని గట్టిగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
తప్పు లేదు.. మంచి లాజిక్కే గానీ ఫిష్ ఫ్రై తినేటప్పుడూ.. చికెన్ టిక్కా లాగించే సమయంలోనూ మటన్ బోన్ లో గుజ్జును సర్రున జుర్రుకునేటప్పుడూ ఈ పాపం ఈ మేథావి విమర్శకులకు యానిమల్ లవ్ గుర్తుకురాదేమో!