Begin typing your search above and press return to search.
ప్రీమియర్లు అప్పుడే వద్దంటున్న హీరోయిన్
By: Tupaki Desk | 3 Nov 2018 2:07 PM GMTకొన్నేళ్ళ క్రితం సినిమాకు సెకండ్.. థర్డ్ రిలీజులు ఉండేవి. సెకండ్.. థర్డ్ రిలీజుల విషయం ఈ సోషల్ మీడియా జెనరేషన్ కు తెలియక పోవచ్చు. ఎందుకంటే టీవీ దెబ్బకు వాటికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక టీవీలోనే త్వరగా సినిమాలు వస్తాయనుకుంటే అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీన్ మరింతగా మారిపోయింది. 100 రోజుల తర్వాత ప్రీమియర్లు అనే స్టేజి నుండి 50 రోజులకే ప్రీమియర్లు అనే స్టేజికి వచ్చాయి. రీసెంట్ గా అది 30 రోజులకు తగ్గింది.
ఇక టీవీ ఛానల్స్ కూడా వారిబాటలోనే నడుస్తూ సినిమా విడుదలయిన 30 రోజలకే టీవీ లో ప్రీమియర్లు వేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అది మంచిదా కాదా అన్నది ఒక పెద్ద డిబేట్. దిల్ రాజు లాంటి సీనియర్ నిర్మాతలే దీన్ని సమర్థిస్తున్నారు. రెండు మూడు వారాల థియేట్రికల్ రన్ కూడా లేనప్పుడు నిర్మాతకు అలా అయినా కొంత ఇన్వెస్ట్ మెంట్ రికవర్ అవుతుందని వారి అభిప్రాయం.
ఇదిలా ఉంటే తాజా గా విజయ్ సేతుపతి - త్రిష లు జోడీగా నటించిన తమిళ చిత్రం '96' విడుదలై విజయం సాధించింది. ఇప్పటికి ఐదు వారాలయినా ఇంకా మంచి కలెక్షన్స్ తో నడుస్తోంది. కానీ సన్ టీవీవారు ఈ సినిమా ప్రీమియర్ ను మరో రెండు రోజుల్లో టీవీలో వేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో స్పందించిన త్రిష ట్విట్టర్ ద్వారా ప్రీమియర్లను సంక్రాంతికి వాయిదా వేయాలని కోరింది. "ఇది మా సినిమాకు ఐదో వారం అయినా ఇంకా థియేటర్లలో 80% ఆక్యుపెన్సీ ఉంది. అందువల్ల '96' ప్రీమియర్లను ఇంత త్వరగా వేయడాన్ని న్యాయం అని మా టీమ్ అనుకోవడం లేదు. దయచేసి ఈ ప్రీమియర్ ను సంక్రాంతికి వాయిదా వేయాలని సన్ టీవీ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం." అంటూ #బ్యాన్ 96 ప్రీమియర్ ఆన్ సన్ టీవీ అనే హ్యాష్ టాగ్ జత చేసింది.
మరి సన్ టీవీ వారు త్రిష రిక్వెస్ట్ కు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.