Begin typing your search above and press return to search.
గొంతు సవరించుకుంటున్న త్రిష...
By: Tupaki Desk | 21 Aug 2015 10:00 AM GMTసినిమాలో కంటెంట్ కంటే పబ్లిసిటీకే ఇంపార్టెన్స్ ఎక్కువయిపోతోంది. ప్రొడక్షన్ స్థాయి నుంచే డిఫరెంట్ స్టయిల్స్ లో ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకోసం రకరకాల ఐడియాలు వేస్తున్నారు. అందులో ఒకటి నటీనటులతో పాటలు పాడించడం కూడా. ఈ విషంయలో టాప్ హీరోలందరూ దాదాపు గొంతు సవరించుకున్నవారే. ఈ జాబితాలో ఇప్పుడు హీరోయిన్లు కూడా చేరుతున్నారు.
తాజాగా నాయకి అనే మూవీలో నటిస్తోంది త్రిష. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్20న చెన్నైలో ప్రారంభమైంది. లీడ్ రోల్ లో... డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న కేరక్టర్ చేస్తోంది భామ. తన కోసమే ఈ కథ రాశారని స్వయంగా చెప్పింది కూడా. ఇప్పుడు నాయకిలో ఓ పాట పాడబోతోందట త్రిష. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె స్వయంగా చెప్పాడు. ఈ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెడుతున్న రఘు... ఫస్ట్ మూవీ లోనే... డిఫరెంట్ ఎటెంప్ట్ చేయబోతున్నాడు.
నాయకిలో దెయ్యంగా కనిపించబోతున్న త్రిష బాగా భయపెడుతుందట. ఇందుకోసం అధ్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయబోతున్నట్లుగా చెప్పాడు రఘు కుంచె. అన్నట్లు ఈ సంగీత దర్శకుడు గతంలో మంచు లక్ష్మిని కూడా సింగర్ చేశాడు దొంగాట సినిమాలో. ఎటెంప్ట్ బాగుంది కానీ.. అది జనాలని ఎంటర్టెయిన్ చేసేలా ఉండడం ముఖ్యం. ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి రఘు కుంచె...