Begin typing your search above and press return to search.
ఏమ్మా త్రిషా.. ఇంకేం మిగిలిందక్కడ?
By: Tupaki Desk | 13 Dec 2015 6:00 AM GMTబక్కచిక్కిన సైజ్ జీరో కంటే బొద్దుగా ఉండే సైజ్ సెక్సీనే సూపర్ అంటూ ‘సైజ్ జీరో’లో పెద్ద ఉద్యమమే నడిపింది అనుష్క. అందులో అనుష్క అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్లే ఎక్కువమంది. అప్పట్లో కరీనా కపూర్ ను చూసి బాలీవుడ్ భామలతో పాటు సౌత్ హీరోయిన్లు కూడా సన్నబడే పన్లో పడ్డారు కానీ.. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు మరీ అంత బక్కచిక్కిపోవడానికి ఆసక్తి చూపించట్లేదు. ప్రేక్షకులు కూడా హీరోయిన్లు మరీ సన్నగా ఉండాలనేమీ కోరుకోవట్లేదు.
ముఖ్యంగా తమిళ ప్రేక్షకులకైతే ఎప్పుడూ బొద్దే ముద్దు. అక్కడే ఎక్కువగా బొద్దుగుమ్మలే రాజ్యమేలారు. ఐతే త్రిష విషయంలో మాత్రం కొంచెం మినహాయింపునిచ్చారు. ఆమె కెరీర్ ఆరంభం నుంచి సన్నగానే ఉంటోంది. ఐతే గత కొన్నేళ్లుగా మరీ సన్నగా కనిపిస్తుండటంతో త్రిషలో గ్లో అంతా పోయినట్లు అనిపిస్తోంది. ఐతే ఇప్పటికే బక్కగా కనిపించే ఈ చెన్నై సుందరి ఇప్పుడింకా సన్నబడుతోందట.
తన కొత్త సినిమా ‘నాయకి’లో త్రిష రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తోందట. అందులో ఓ పాత్ర కోసం ఆమె ఐదు కిలోల బరువు తగ్గిందట. ఐతే పాత్రల్లో వైవిధ్యం చూపించాలనుకుంటే ఇంకా బరువు పెరిగితే సరిపోయేది కానీ.. అసలే ఒంట్లో కండ లేని అమ్మాయి ఇంకా చిక్కిపోతే చూడ్డం మరీ కష్టం కదా అంటున్నారు జనాలు. మరి ఆ అవతారంలో త్రిష ఎలా ఉంటుందో చూడాలి.