Begin typing your search above and press return to search.
వరుణ్ ఊసెత్తనంటున్న త్రిష
By: Tupaki Desk | 2 July 2015 6:14 AM GMTఇంతకీ త్రిషకు, వరుణ్ మణియన్‌కు ఎక్కడ చెడింది? నిశ్చితార్థం చేసుకున్న కొన్ని రోజులకే వీళ్లెందుకు విడిపోయారు? వాళ్ల నిశ్చితార్థం రద్దుకు కారణమేంటి? చాలా సందేహాలే ఉన్నాయి త్రిష అభిమానుల్లో. కానీ వరుణ్ కానీ, త్రిష కానీ ఈ విషయంలో నోరే విప్పడం లేదు. వరుణ్ సంగతి వదిలేద్దాం.. కానీ త్రిష తన అభిమానుల కోసమైనా ఏం జరిగిందో చెప్పాలి కదా. కానీ ఆ సంగతి మాత్రం అడగొద్దు.. కొందరి పేర్లు ఎత్తడం నాకిష్టం లేదంటూ పరోక్షంగా వరుణ్ మణియన్ మీద సెటైర్ వేసేసింది.
''నేను నా జీవితంలో సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక్క మా అమ్మ మాత్రమే. ఇంకెవరి గురించీ నేను పట్టించుకోను. నా బ్రేకప్ విషయంలో నేను, మా అమ్మ చాలా సంతోషంగా ఉన్నాం. అంతకుమించి నేనెవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ వ్యవహారం గురించి మాట్లాడాల్సి వస్తే కొందరు పేర్లు ఎత్తాలి. కానీ వాళ్ల గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. నేనసలు గతం గురించి పట్టించుకోను. కాబట్టి ఆ సంగతి వదిలేయండి'' అని సూటిగా చెప్పేసింది త్రిష.
నిశ్చితార్థం రద్దయినంత మాత్రాన తానేమీ పెళ్లికి వ్యతిరేకం కాదని చెప్పింది త్రిష. ''నాకిప్పటికీ పెళ్లి మీద నమ్మకం ఉంది. ఐతే సమాజం కోసం మనం పెళ్లి చేసుకోలేం కదా. వయసన్నది పెద్ద విషయమే కాదు. నాకు పాతికేళ్ల వయసున్నపుడు సరైన వ్యక్తి దొరికి ఉంటే పెళ్లి చేసేసుకునేదాన్ని. పెళ్లి వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్లనూ చూస్తున్నా. సంతోషంగా ఉన్నవాళ్లనూ చూస్తున్నా. ఎవరికోసమో మనం పెళ్లి చేసుకోకూడదు. సరైన వాడు దొరికినపుడు ఏ వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చు'' అంటూ వేదాంతం వల్లించింది త్రిష.