Begin typing your search above and press return to search.

కెరీర్ కోసం త్రిష ఫారిన్లో పూజ చేసిందా?

By:  Tupaki Desk   |   23 Feb 2017 6:34 AM GMT
కెరీర్ కోసం త్రిష ఫారిన్లో పూజ చేసిందా?
X
జల్లికట్టు దెబ్బకి నెల్లాళ్లు ట్విట్టర్ కి దూరమైపోయిన త్రిష.. మళ్లీ వేలంటైన్స్ రోజున కొత్త సినిమా కబుర్లతో జనాల ముందుకు వచ్చింది. తాజాగా విక్రమ్ మూవీ సామీ2లో హీరోయిన్ గా ఎంపికైందని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది త్రిష. కొన్ని నెలల క్రితం అసలు కెరీర్ ముగిసిపోయిందని అనుకుంటున్న పరిస్థితి. ఒకట్రెండు లో బడ్జెట్ హారర్ సినిమాలు తప్ప మరేమీ లేని సిట్యుయేషన్. వీటి నుంచి ఇప్పుడు టాప్ గేర్ లోకి రావడానికి కారణం.. బ్యాంకాక్ లో చేసిన పూజలే అని భావించేస్తోందిట త్రిష.

తమ బ్యూటీని మెయింటెయిన్ చేయడానికి ఆయుర్వేదిక్ మసాజ్ లు.. శాండ్ మసాజ్ ల వాటి కోసం.. బ్యాంకాక్ వెళుతుంటారు భామలు. నిగనిగలాడేలా చర్మం కనిపించాలంటే ఇది చాలా కీలకం. త్రిషకి బ్యాంకాక్ లోని ఓ పార్లర్ లో పనిచేసే ఓ యువతి.. అక్కడి పొలిమేరల్లో ఉన్న ఓ ఆలయం గురించి చెప్పిందట. అక్కడ పూజలు చేస్తే.. చాలా మహిమలు జరిపోతాయని వివరించిందిట. ఆమె మాటలకు కన్విన్స్ అయిన ఈ చెన్నై సోయగం.. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఫారిన్ పూజలు పూర్తి చేసేసిందిట.

కట్ చేస్తే.. త్రిష ఇప్పుడు అధికారికంగా 7 క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసింది. రీసెంట్ గా 96.. గర్జనై ఫస్ట్ లుక్ లను తానే రివీల్ చేసింది. విక్రమ్ తో సామి2లో అవకాశం దక్కించుకుంది. ఇదంతా బ్యాంకాక్ దేవుడి మహిమే అని భావించేయడంలో.. త్రిష తప్పేం లేదుగా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/