Begin typing your search above and press return to search.

త్రిష ప్రత్యేక పూజలు.. తొందరపడి ఎక్కడికో వెళ్లకండి

By:  Tupaki Desk   |   23 Aug 2021 3:33 AM GMT
త్రిష ప్రత్యేక పూజలు.. తొందరపడి ఎక్కడికో వెళ్లకండి
X
తన తోటి హీరోయిన్లంతా లైఫ్ లో పెళ్లి అనేదానితో సెటిల్ అయిపోయిన వేళలో.. త్రిష మాత్రం అందుకు భిన్నంగా ఇంకా మూవీలు చేసుకుంటూ సోలో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో పెళ్లి వరకు వెళ్లిన వైనం ఒకటి హటాత్తుగా ఆగిపోవటం.. ఎందుకలా? అన్న దానికి సరైన సమాధానం ఇప్పటివరకు రాలేదు. ఆ ఎపిసోడ్ తర్వాత పెళ్లి మాట అన్నది లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది త్రిష. తాజాగా ఆమె మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ అనే మూవీలో నటిస్తోంది.

దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఓర్చా లొకేషన్ లో జరుగుతోంది. కార్తీ..త్రిష మీద సీన్లు ఇక్కడ తీస్తున్నారు. ఓర్చా లొకేషన్ లోనే కాదు.. మధ్యప్రదేశ్ లోని వివిధ లోకేషన్లలో షూట్ చేస్తున్నారు. తాజాగా ఒక గుడిలో పూజలు చేస్తున్న సీన్లను తీశారు. ఈ పూజలన్ని సినిమా కోసమే తప్పించి.. వ్యక్తిగతమైనవి కావంటున్నారు.

త్రిష పూజలు చేస్తున్నారన్న వెంటనే.. పెళ్లి కొసమని ఫిక్స్ కావటం ఖాయం. కానీ.. ఈ పూజలు సినిమా కోసమని చెబుతున్నారు. పూజలు చేసినా.. చేయకపోయినా.. ఆమె జీవితంలో అనుకున్నరీతిలో సెటిల్ కావాలని మాత్రం ఆమె అభిమానులు కోరుతున్నారు. వారి కోరిక ఎప్పటికి తీరుతుందో?