Begin typing your search above and press return to search.
ఆరో సినిమా మొదలుపెడుతున్న త్రిష
By: Tupaki Desk | 11 Jun 2017 11:12 AM GMT30 ప్లస్ లో పడ్డారంటే హీరోయిన్ల కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లు భావిస్తారు. కానీ ఈ మధ్య కొందరు హీరోయిన్ల 30ల తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. నయనతార.. త్రిష.. శ్రియ ఈ కోవలోకే వస్తారు. ఈ ముగ్గురిలోనూ యమ స్పీడుమీదున్నది త్రిషే అని చెప్పాలి. ఆమె చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలుండటం విశేషం. ఐదు సినిమాలు విడుదలకు ముస్తాబవుతుంటే.. కొత్తగా ఇంకో సినిమాను మొదలుపెడుతోంది త్రిష. ఆ చిత్రం పేరు.. 96. విలన్.. ఫ్రెండు వేషాల నుంచి హీరోగా మారి.. స్టార్ స్టేటస్ సంపాదించిన విజయ్ సేతుపతి ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం విశేషం. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదొక వైవిధ్యమైన థ్రిల్లర్ అంటున్నారు.
త్రిష గత ఏడాది.. ఈ ఏడాది కమిటైన ఐదు సినిమాల్ని దాదాపుగా పూర్తి చేసేసింది. అరవింద్ స్వామికి జోడీగా ‘శతురంగ వేట్టై 2’లో నటిస్తున్న త్రిష.. ‘మోహిని’ అనే హార్రర్ థ్రిల్లర్లో లీడ్ రోల్ చేస్తోంది. దీంతో పాటు ‘హేయ్ జూడ్’.. ‘1818’.. ‘గర్జనై’ సినిమాల్లోనూ త్రిష కథానాయికగా కనిపించనుంది. త్రిషకు ఈ మధ్య కాలంలో అంత మంచి విజయాలేమీ లేకపోయినప్పటికీ అవకాశాలకైతే కొదవలేదు. గత ఏడాది ఆమె చేసిన ద్విభాషా చిత్రం ‘నాయకి’ అట్టర్ ఫ్లాప్ అయింది. దాని కంటే ముందు తెలుగులో త్రిష నటించిన ‘లయన్’ కూడా ఫ్లాపే. అజిత్ సరసన నటించిన ‘ఎన్నై అరిందాల్’ మాత్రమే గత కొన్నేళ్లలో త్రిషకు హిట్టు. 30 ప్లస్ లో ఉంటూ సరైన విజయాలు లేకున్నా ఇన్నేసి అవకాశాలు దక్కించుకోవడం అరుదైన విషయమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/