Begin typing your search above and press return to search.

ఏంటి త్రిషా ఇలా భయపెడుతున్నావ్!!

By:  Tupaki Desk   |   26 Aug 2016 4:14 AM GMT
ఏంటి త్రిషా ఇలా భయపెడుతున్నావ్!!
X
అసలు కెరియర్ ను కరక్టుగా ప్లాన్ చేసుకోవాల్సిన టైములో.. కెరియర్ వదిలేస్తున్నా అన్నట్లు సిగ్నల్స్ ఇచ్చేలా ఎంగేజ్మంట్ అనేసింది త్రిష. ఆ తరువాత ఎందుకో ఆ ఎలియన్స్ బ్రేకవ్వడంతో మళ్లీ సినిమాలతో రచ్చ చేస్తా అంటూ రంగంలోకి దిగింది. కాని ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా ఖాతాలో పడలేదు. సోలో హిట్టు కొడుతుందేమో అనుకుంటే.. నాయకి సినిమాతో కనీసం సింగిల్ డే కూడా అలరించలేదు. ఇంతకీ ఇప్పుడు ఈ బంగారం ఏం చేస్తోంది?

అదిగో ఆ ఫోటోలో చూడండి.. ఎంచక్కా జిమ్ కు వెళ్ళి కండలు కరిగిస్తోందట. ఈ మధ్య కాలంలో అమెరికా టూర్.. చెన్నయ్ లో పార్టీలు.. బ్యాంకాక్ ట్రిప్.. ఇలా చాలా సందడి చేసిన త్రిష బాగానే వెయిట్ పెరిగిపోయిందట. చేతిలో ప్రస్తుతం ఒకేఒక్క సినిమా ఉన్నా కూడా.. ఎలాగైనా బాగా సన్నబడి నాజూకుగా తయారై.. మరోసారి తన గ్లామర్ మంత్రంతో మ్యాజిక్ చేస్తానంటోంది. అందుకే జిమ్ లో ఈ రేంజులో కష్టపడి.. అమ్మడు చెమట్లు ఓడుస్తోంది. మేకప్ లేకుండ ఇలా చెమటలు కక్కుతున్న త్రిషను చూడాలంటే కాస్త కష్టమే. చాలామంది భయమేస్తోంది కూడా.

అయినా అమ్మడు పడుతున్న కష్టం చూస్తుంటే.. కాస్త జాలేస్తుంది. మరి 30+ హీరోయిన్ల గ్యాంగులో చేరిన త్రిష.. మరి అనుష్క అండ్ నయనతార టైపులో ఇంకా హవా కొనసాగిస్తుందో లేకపోతే తన స్నేహితురాలు శ్రీయ తరహాలో ఫేడవుట్ అవుతుందో చూడాలి. నువ్వు చెమట్లు పట్టేదాకా కుమ్మెయ్ నానా!!