Begin typing your search above and press return to search.

మెట్రోలో చక్కర్లు కొడుతోంది

By:  Tupaki Desk   |   18 July 2015 7:48 AM GMT
మెట్రోలో చక్కర్లు కొడుతోంది
X
ఓ అందమైన అమ్మాయి.. రెబాన్‌ గాగుల్స్‌.. టైట్‌ఫిట్‌ చినుగుల జీన్స్‌, వైట్‌ అండ్‌ వైట్‌ టాప్‌ లో కనిపించింది. ఈ రూపం చూస్తే ఎక్కడో చూసినట్టుందే.. ఓ మై గాడ్‌.. త్రిష, అందాల త్రిష. నా కలల రాణి, గుండెల్ని చిదిమేసే రాబందు! అంటూ కుర్రాళ్లు పరేషాన్‌ అయిపోయారంతే. ఇదంతా ఎక్కడ జరిగింది? అనేగా మీ సందేహం. ఓ మెట్రో రైల్‌లో, మెట్రో రైల్వే స్టేషన్‌ లో.

ఈ భామ ఎక్కడినుంచి ఊడిపడిందో ఉన్నట్టుండి చెన్నయ్‌ మెట్రో రైల్‌లో కనిపించి అల్లాడించింది. వేకువ ఝామునే 7.30కి ఎక్కడుతంగల్‌ మెట్రో రైల్వే స్టేషన్‌ లో ప్రత్యక్షమైంది. అక్కడ ఆగి ఉన్న ట్రెయిన్‌ లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి అశోక్‌ నగర్‌, వడపళని వంటి సిటీల్ని చుట్టేసింది. రైలు ప్రయాణం ఆద్యంతం త్రిష ఎన్నో మధురానుభవాల్ని ఎదుర్కొంది.

అభిమానులు తనతో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఉన్నట్టుండి తమ కళ్ల ముందే అభిమాన దేవత ప్రత్యక్షమైనందుకు కుర్రాళ్లయితే ముసిముసిగా గుబులు గుబులుగా సిగ్గు పడిపోయారు. అంతేకాదు.. ఓమారు విదేశీ షూటింగులకు వెళ్లినప్పుడు అక్కడి మెట్రోలో ఎలాంటి హంగామా లేకుండా శికారు చేసొచ్చేది. అక్కడ తనని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఇక్కడ మాత్రం న్యూయార్క్‌ మెట్రోని మించి చెన్నయ్‌ మెట్రో దుమ్ము దులిపేస్తోంది అంటూ కితాబిచ్చింది.