Begin typing your search above and press return to search.

ఛాలెంజింగ్‌ రోల్‌ కు సిద్దమైన సీనియర్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   27 Nov 2020 7:00 AM GMT
ఛాలెంజింగ్‌ రోల్‌ కు సిద్దమైన సీనియర్‌ బ్యూటీ
X
సౌత్‌ లో ముఖ్యంగా టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా దాదాపుగా రెండు దశబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న త్రిష కెరీర్‌ తుది దశకు చేరుకుంది అనుకుంటున్న ప్రతి సారి కూడా ఆమెకు అనూహ్యంగా ఏదో ఒక మంచి ఆఫర్‌ రావడం సక్సెస్‌ అవ్వడం మరి కొన్నాళ్ల పాటు కెరీర్‌ కంటిన్యూ చేయడం జరుగుతుంది. తాజాగా త్రిష మరో సినిమాకు కమిట్‌ అయ్యింది. అయిదు సంవత్సరాల క్రితం బాలీవుడ్‌ లో వచ్చిన పీకు మూవీ రీమేక్‌ లో త్రిష నటించబోతుంది. ఈ రీమేక్‌ ను తెలుగు మరియు తమిళంలో రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

పీకు మూవీలో దీపిక పదుకునే పోషించిన పాత్రలో త్రిష నటించబోతుంది. పీకు సినిమాలో అమితాబచ్చన్‌ కీలక పాత్రలో కనిపించారు. రీమేక్‌ లో ఆ పాత్రను ఎవరు చేస్తారు అనేది చూడాలి. ఛాలెంజింగ్‌ రోల్‌ కు త్రిష ముందుకు వచ్చింది. మరి బచ్చన్‌ జీ పోషించిన పాత్ర కూడా అంతకు మించి ఛాలెంజింగ్‌ గా ఉంటుంది. త్రిషతో ఆ ఛాలెంజ్‌ ను షేర్‌ చేసుకునేందుకు ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది. తెలుగు మరియు తమిళంలో సుపరిచితుడు అయిన నటుడిని తీసుకోవాలని భావిస్తున్నారు.

సీనియర్‌ హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి వారిలో ఎవరు ఓకే చెప్తారు అనేది చూడాలి. త్రిష ఈ సినిమాతో మరోసారి నటిగా తనను తాను నిరూపించుకోవడంతో పాటు ఖచ్చితంగా ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ సినిమా తర్వాత త్రిష మరో రెండేళ్ల పాటు కెరీర్‌ ను కొనసాగిస్తుందేమో చూడాలి. వచ్చే ఏడాది వరకు ఈ రీమేక్‌ పట్టాలెక్కే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాదిలోనే సినిమా విడుదల అయ్యే అవకాశం కూడా ఉంది.