Begin typing your search above and press return to search.
త్రిష.. ప్రియమణి.. హీరోల్లేకుండా..
By: Tupaki Desk | 31 Jan 2018 5:51 PM GMTపెళ్లైన కొత్తలో సినిమాతో టాలీవుడ్ లో ప్రియమణికి గుర్తింపు వచ్చింది. తన నటనతో తొలిరోజుల్లోనే నేషనల్ అవార్డ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తరవాత కమర్షియల్ సినిమాల్లోనూ రాణించింది. కానీ ఈమధ్య సినిమాల్లో ఆఫర్లు తగ్గడంతో టెలివిజన్ పై ఫోకస్ పెట్టింది. తెలుగు - తమిళ భాషల్లో డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉంది.
ప్రియమణికి పేరొచ్చింది తెలుగు - తమిళ సినిమాలతోనే. చాలా కాలం తరవాత ఆమె మళ్లీ ఓ డిఫరెంట్ రోల్ తో తమిళ తెరపై కనిపించనుంది. ఇందులో మరో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా నటించనుంది. ఇందులో హీరో పాత్రలంటూ ఏవీ లేవు. రెండు బలమైన పాత్రల సంఘర్షణగా ఈ సినిమా కథ ఉంటుంది. ఈ రెండు పాత్రలనే ప్రియమణి.. త్రిష చేయబోతున్నారు. వెర్నిక్ అనే దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇతడికి ఫేమస్ తమిళ డైరెక్టర్ బాలా దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
లాస్ట్ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజర్ ను ముస్తఫాను పెళ్లి చేసుకున్న ప్రియమణి ప్రస్తుతం వరసగా కన్నడ సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన ద్వజ మూవీ రిలీజుకు సిద్ధమవుతోంది. నన్న ప్రకార అనే సినిమా షూటింగ్ లో ఉంది. ఇటు మూవీస్ కోసం బెంగుళూరుకు.. టీవీ షోల కోసం హైదరాబాద్.. చెన్నైలకు చకచకా ఫైట్లు ఎక్కి దిగుతూ అటు కెరీర్ ను.. పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ప్రియమణి.