Begin typing your search above and press return to search.

రజనీతో చేయనందుకు బాధపడుతోంది

By:  Tupaki Desk   |   10 Jun 2015 11:30 AM GMT
రజనీతో చేయనందుకు బాధపడుతోంది
X
వయసు పరంగా 30 ప్లస్‌ క్లబ్‌లో చేరాక క్యూట్‌ త్రిష బోలెడన్ని చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఇంత సుదీర్ఘ కాలంలో అందరు స్టార్‌ హీరోలతో పనిచేసినా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన మాత్రం నటించలేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? అన్న ప్రశ్నకు ఈ చెన్నయ్‌ చంద్రం ఠకీమని ఊహించని సమాధానం చెప్పేసింది.

కారణం ఏదైనా నటించలేదు. బాధగా ఉంది. ఛాన్సొస్తే బాగుంటుంది.. అంటోంది. అలాగే సుదీర్ఘ కాలం కెరీర్‌ని సాగించడానికి ఉపయోగపడిన పాయింటు ఏమిటి? అని ప్రశ్నిస్తే లక్‌, క్వాలిటీ రెండూ కలిసొచ్చాయి. క్వాంటిటీతో పనిలేకుండా నటించడం వల్లే సుదీర్ఘ కాలం నటించగలిగానని చెప్పింది. ఇంకా ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఎన్నో ఆసక్తికర సంగతులు ముచ్చటించింది. సమంత నాకు మినీ వెర్షన్‌ అని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచింది. ఒకవేళ నటి కాకపోయి ఉంటే ఓ ఇద్దరు పిల్లలు.. వాళ్లతో కలిసి ఓ జంతుసంరక్షణ కేంద్రాన్ని నడుపుకునేదానినని చెప్పింది.

అమెరికాలో లివింగ్‌ అంటే తనకి ఎంతో ఇష్టమని చెప్పింది. జ్యోతిక రీఎంట్రీ బావుంది. అది ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చింది. ముదిమి వయసులో తనలాగే మహిళా ప్రధాన పాత్రల్లో నటించే అవకాశం ఉందని చెప్పింది. త్రిష మనసులో ఉన్నవి ఏదీ దాచుకోకుండా చెప్పేసింది. ఇంట్రెస్టింగ్‌ కదూ!