Begin typing your search above and press return to search.

త్రిషా మరీ అంత బడాయి వద్దమ్మా

By:  Tupaki Desk   |   4 Jan 2016 9:30 AM GMT
త్రిషా మరీ అంత బడాయి వద్దమ్మా
X
రెండు మూడేళ్ల కిందటే ముగిసిపోయేలా కనిపించింది త్రిష కెరీర్. కానీ అనుకోకుండా కొన్ని అవకాశాలు రావడంతో ఇంకా ఎలాగోలా బండి లాక్కొస్తోంది. ఐతే తానేదో తెగ బిజీగా ఉన్నట్లు.. తీరికే దొరకనట్లు భలే బడాయి పోతోందీ చెన్నై చిన్నది. ‘‘నెలలో మూడు వారాలే షూటింగ్‌ లో పాల్గొనాలని ఓ నిబంధన పెట్టుకున్నాను. మరీ తప్పదనుకుంటేనే నాలుగో వారం కూడా షూటింగుకి డేట్లు ఇస్తాను. నేనెంత బిజీగా ఉంటున్నప్పటికీ మే, డిసెంబర్‌ నెలల్లో స్నేహితులతో కలిషి హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నా. పగలనక - రాత్రనక షూటింగులో పాల్గొంటుంటా కాబట్టి రీఛార్జ్ కావాలంటే ఆ బ్రేక్ అవసరం అని నా ఫీలింగ్’’ అంటూ వగలు పోయింది త్రిష.

ఎప్పటికప్పుడు కొత్త వాళ్లు వస్తున్నా ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలుపుకుంటుండటం చాలా సంతోషంగా ఉందని త్రిష చెప్పింది. ‘‘ఇండస్ట్రీలో ఫ్రెష్ ఫేస్‌ లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తవాళ్లను చూడాలనుకుంటారు. కొత్తవాళ్లకు దీటుగా నిలబడాలి. అలా నిలబడాలంటే, నటిగా నిరూపించుకోవాలి. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలి. నేనది సాధిస్తున్నాను. ఇప్పటికీ నన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తుండటం గొప్ప విషయం’’ అని చెప్పింది త్రిష. తాను డ్యాన్స్‌ లో శిక్షణ తీసుకున్నప్పటికీ.. డ్యాన్స్ అంటే తనకు చాలా భయమని.. కొన్ని వందల పాటల్లో డ్యాన్సులు చేశాక కూడా.. ఇప్పటికీ ఓ పాట చిత్రీకరణ అనగానే తనకు భయంగానే ఉంటుందని త్రిష చెప్పింది.