Begin typing your search above and press return to search.
ఇక అత్త పాత్రలకు త్రిష రెడీనా?
By: Tupaki Desk | 16 Dec 2021 3:30 AM GMTతెలుగు-తమిళంలో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించింది అందాల త్రిష. క్యూట్ లుక్స్ తో హాట్ అప్పియరెన్స్ తో గుండెలు కొల్లగొట్టే ప్రతిభావనిగా త్రిష అభిమానులకు కనెక్టయి ఉంది. ఈ ఏడాది 14డిసెంబర్ నాటికి తన కెరీర్ 19 సంవత్సరాలు పూర్తయింది. అంటే 2022లో తాను సినీఆరంగేట్రం చేసి రెండు దశాబ్ధాల కెరీర్ ని పూర్తి చేసుకోబోతోందన్నమాట.
ఈ సందర్భంగా త్రిష ఎంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. తాను సినీరంగంలో ప్రవేశించడానికి షాకిచ్చే కారణాన్ని కూడా చెప్పింది. ఒక తెలివైన వ్యక్తి ఒకసారి చెప్పాడు.. మీకు సెలవు అవసరం లేని ఉద్యోగం సంపాదించుకోండి.. అని! నేను అలాగే చేసాను. నేను ఇంకా సెలవులో ఉన్నాను. ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్న వారి కోసం నేను మిమ్మల్ని ఎప్పటికీ వెళ్లనివ్వను. మీ అందరి కారణంగా నేను ఈ రోజు ఉన్నాను. నా జీవితంలో అత్యుత్తమమైన 19 సంవత్సరాలకు ధన్యవాదాలు..`` అంటూ త్రిష ఎమోషనల్ అయ్యింది.
2002 సంవత్సరంలో సూర్య సరసన దర్శకుడు అమీర్ `మౌనం పెసియతే` అనే చిత్రంతో అరంగేట్రం చేసిన త్రిష నీ మనసు నాకు తెలుసు అనే చిత్రంతో తెలుగులో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత వర్షం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని ఎదురేలేని స్థాయికి ఎదిగింది. టాలీవుడ్ లో క్వీన్ అని నిరూపించింది. క్వీన్ ఆఫ్ సౌత్ గా నీరాజనాలు అందుకుంది. అన్నట్టు ఇటీవల త్రిషకు సరైన హిట్టు లేదు. తెలుగులో సినిమాల్లేవ్.. అగ్ర హీరోల కోసం ట్రై చేసినా పనవ్వడం లేదు. అందుకే ఇక క్యారెక్టర్ నటిగా అవకాశాలొస్తే నటిస్తుందా? అత్త పాత్రలకు ఓకే చెబుతుందా? అంటూ ఒక సెక్షన్ కామెంట్లు చేస్తోంది. అయితే వెబ్ సిరీస్ లు.. కన్నడ మలయాళ చిత్రాల్లో ప్రయత్నించే ఆలోచన ఏదైనా ఉందా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. మరి అన్నిటికీ ప్రాక్టికల్ గానే సమాధానమిస్తుందేమో చూడాలి.