Begin typing your search above and press return to search.
క్రైమ్ రీమేక్ లో 96 బ్యూటీ
By: Tupaki Desk | 19 March 2019 7:47 AM GMTగత వారం విడుదలై మంచి రెస్పాన్స్ తో పాటు వసూళ్లను అందుకున్న బద్లా ని సౌత్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. హిందీలో తాప్సి పోషించిన పాత్రను తమిళ్ తెలుగులో త్రిషతో చేయించాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు కోలీవుడ్ టాక్. గత ఏడాది తుమారి సులు రీమేక్ ని జ్యోతికతో తీసి హిట్ కొట్టిన నిర్మాత ధనుంజయ్ దీన్ని ఇక్కడి రెండు భాషల్లోకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట. ఇది మరికొద్ది రోజుల్లో ఖరారు కావొచ్చు.
తనకు తెలియకుండా హత్య కేసులో ఇరుక్కున్న తాప్సిని రక్షించేందుకు వస్తాడు లాయర్ అమితాబ్ బచ్చన్. తర్వాత కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇదే బద్లా కథ. ఇది విపరీతంగా నచ్చబట్టే షారుఖ్ ఖాన్ కోరి మరీ తన రెడ్ చిల్లీస్ బ్యానర్ మీద దీన్ని నిర్మించాడు. అయితే ఇక్కడ రీమేక్ వెర్షన్ లో మనకూ పరిచయమున్న తాప్సికి బదులు త్రిషను ఎందుకు ఛాయస్ గా పెట్టుకున్నారు అనే అనుమానం రావొచ్చు.
కొంతకాలంగా అవకాశాలు తగ్గు ముఖం పట్టిన త్రిషకు గత ఏడాది వచ్చిన 96 బ్లాక్ బస్టర్ సక్సెస్ తన కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. అవకాశాలు మళ్ళి రావడం మొదలయ్యాయి. పైగా తాప్సితో పోలిస్తే త్రిషకె మార్కెట్ పరంగా తమిళ్ తెలుగులో ఎక్కువ ఎడ్జ్ ఉంది. అందుకే తనను తీసుకునే ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఇది ఓకే కానీ మరి అమితాబ్ పాత్రకు ఏ హీరో దొరుకుతాడో చూడాలి. పింక్ రీమేక్ ను ఇప్పుడీ బద్లా అవకాశాన్ని రెండు మిస్ కావడం తాప్సి బ్యాడ్ లక్కే