Begin typing your search above and press return to search.
జూలైలో త్రివిక్రమ్ స్టార్ట్ చేసేస్తున్నాడు
By: Tupaki Desk | 14 Dec 2015 5:30 PM GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్ట్స్ వెంచర్ ఏంటి ? ప్రస్తుతం నితిన్ - సమంతలతో అ..ఆ.. తీస్తున్న త్రివిక్రమ్.. తర్వాత స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఎవరితో ? తన మాటల మంత్రాలను ఎవరిపై ప్రయోగించబోతున్నాడు? ఇన్నాళ్లూ ఇవి ప్రశ్నలే కానీ ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది. త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది.
అ..ఆ.. తర్వాత త్రివిక్రమ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తాడని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడనే టాక్స్ వినిపించాయి. అయితే.. అవన్నీ రూమర్సే అని తేలిపోయింది. వచ్చే ఏడాది జూలైలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వెంచర్ స్టార్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించేశారు. ప్రస్తుతం స్టార్ కాస్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో హీరోయిన్స్ ను కూడా ప్రకటించబోతున్నారు మేకర్స్. అయితే ఈ డైరెక్టర్ సినిమాల్లో సమంత ఉండడం ఇప్పుడు కామన్ అయిపోయింది. సూర్యతో చేయబోతున్న ద్విభాషా చిత్రంలో కూడా సమంత ఒక హీరోయిన్ గా ఖచ్చితంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
అక్కినేని వారసుడు అఖిల్ ని రెండో సినిమాను మాటల మాంత్రికుడితో చేసేందుకు నాగార్జున ట్రై చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చినా.. ఇప్పుడు అది కూడా వర్కవుట్ కాలేదని తేలిపోయింది. ప్రస్తుతానికి టాలీవుడ్ స్టార్స్ అంతా త్రివిక్రమ్ కోసం మరో ఏడాది వెయింటింగ్ చేయక తప్పదు.