Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్‌ బర్త్‌ డే స్పెషల్‌ రీ రిలీజ్‌.. ఫ్యాన్స్ హ్యాపీ

By:  Tupaki Desk   |   2 Nov 2022 6:30 AM GMT
త్రివిక్రమ్‌ బర్త్‌ డే స్పెషల్‌ రీ రిలీజ్‌.. ఫ్యాన్స్ హ్యాపీ
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పుట్టిన రోజు నవంబర్‌ 7. ఆ సందర్భంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక సూపర్ హిట్‌ సినిమా ను రీ రిలీజ్‌ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు ఉన్నాయి. వాటిల్లోంచి ఏది రీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న సమయంలో 'నువ్వే నువ్వే' రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని ఎక్కువ శాతం మంది అనుకున్నారట.

ఇటీవలే నువ్వే నువ్వే సినిమా విడుదల అయ్యి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాను పలు ఏరియాల్లో రీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రత్యేక షో లు వేయడం జరిగింది. అయితే భారీ ఎత్తున పబ్లిసిటీ చేయలేదు అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అందుకే త్రివిక్రమ్‌ బర్త్‌ డే సందర్భంగా మళ్లీ విడుదల చేసి హంగామా చేయాలనే నిర్ణయానికి వచ్చారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నువ్వే నువ్వే సినిమా ను తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. హీరోల స్థాయిలో త్రివిక్రమ్‌ కు అభిమానులు ఉన్నారు. వారంత కూడా త్రివిక్రమ్‌ బర్త్‌ డే ను నువ్వే నువ్వే సినిమా రీ రిలీజ్ తో జరుపుకోబోతున్నారు.

త్రివిక్రమ్‌ దర్శకుడిగా మొదట చేసిన సినిమా నువ్వే నువ్వే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడిగా ఆయన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి అర్థం అయ్యింది. అంతకు ముందు వరకు త్రివిక్రమ్‌ రచయిత మాత్రమే ఈ సినిమా తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు భారీ వసూళ్లను కూడా దక్కించుకున్నాడు.

త్రివిక్రమ్‌ ను ఇండస్ట్రీ లో నిలబెట్టిన నువ్వే నువ్వే సినిమా ను ఆయన బర్త్‌ డే సందర్భంగా రీ రిలీజ్ చేయడం మంచి విషయం అన్నట్లుగా చాలా మంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో నువ్వే నువ్వే రీ రిలీజ్ గురించి త్రివిక్రమ్‌ కాంపౌండ్‌ వారు మరియు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దాంతో రీ రిలీజ్ లో భారీ వసూళ్లను నువ్వే నువ్వే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.