Begin typing your search above and press return to search.
మహేష్ సినిమాతో త్రివిక్రమ్ వ్యాపారం
By: Tupaki Desk | 10 Jun 2022 3:30 PM GMTఇటీవల కాలంలో సినిమా ప్రపంచంలో దర్శకులు హీరోలు కూడా ఒక సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. సినిమాపై అవుట్ పుట్ పై కాన్ఫిడెంట్ గా ఉంటే వారు ప్రత్యేకంగా కొన్ని ఏరియాల్లో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ బాబు సినిమా తో ఒక ఏరియా హక్కులను తీసుకొని సొంతంగా విడుదల చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అల..వైకుంఠపురములో సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మహేష్ బాబు తో సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడో మొదలవలవ్వాల్సింది. కానీ మహేష్ బాబు పై పూర్తి స్థాయిలో క్లారిటీతో వచ్చే వరకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ కూడా పట్టు విడవని విక్రమార్కుని తరహాలో మహేష్ బాబు ఒప్పుకునే వరకు అతని వెంట తిరిగాడు.
ఎలాగైనా ఈ సినిమా కథను మహేష్ బాబు తోనే చేయాలి అని త్రివిక్రమ్ చాలా బలంగా నిర్ణయించుకున్నట్లు అర్థం అయింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు.
అయితే ఈ సినిమా బిజినెస్ కూడా 300 కోట్ల వరకు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యేకంగా కొన్ని ఏరియాల్లో హక్కులను కూడా త్రివిక్రమ్ దక్కించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈస్ట్ గోదావరి ఏరియాలో త్రివిక్రమ్ SSMB28 సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు రెమ్యునేషన్ అందుకోవడమే కాకుండా ఇలా త్రివిక్రమ్ ఒక ఏరియా హక్కులను కొనుగోలు చేసి మంచి బిజినెస్ చేస్తున్నారు అనే చెప్పాలి.
సినిమా అక్కడ భారీ కలెక్షన్స్ అందుకుంటే త్రివిక్రమ్ అంతకుమించి అనేలా ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాను హారిక హాసిని ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మరొక ముఖ్యమైన పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక థమన్ సంగీతం అందించబోతున్న విషయం తెలిసిందే.