Begin typing your search above and press return to search.
'ఆర్ ఎక్స్ 100' పై త్రివిక్రమ్ కామెంట్
By: Tupaki Desk | 29 Oct 2018 5:30 PM GMTకొన్ని నెలల కిందట ‘ఆర్ ఎక్స్ 100’ అనే చిన్న సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. కొత్త దర్శకుడు.. కొత్త హీరో హీరోయిన్లు కలిసి కొందరు దీనిపై బూతు సినిమా అనే ముద్ర వేసే ప్రయత్నం చేసినా.. యువ ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఉర్రూతలూగించిన మాట వాస్తవం. మొదట్లో దీన్ని పెద్దగా పట్టించుకోని ఇండస్ట్రీ జనాలు సైతం తర్వాత సానుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దిల్ రాజు ‘ఆర్ ఎక్స్ 100’ సక్సెస్ మీట్ కు వచ్చి ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. తర్వాత నాగార్జున ఒక ప్రెస్ మీట్లో ఈ చిత్రాన్ని తెగ పొగిడేశాడు. తాజాగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ‘ఆర్ ఎక్స్ 100’ను పొగడ్డం విశేషం. తనుకు ఈ మధ్య బాగా నచ్చిన ఐదు చిత్రాల పేర్లు చెప్పమంటే అందులో ‘ఆర్ ఎక్స్ 100’కు చోటిచ్చాడు.
‘ఆర్ ఎక్స్ 100’ సినిమా మొదట్లో ఒక 20 నిమిషాల పాటు కొంచెం లాగినట్లు అనిపించిందని.. కానీ ఆ తర్వాత మాత్రం అందులో పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తుందని.. మంచి ఫ్లోతో సాగిపోతుందని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డాడు. దీంతో పాటుగా ‘అర్జున్ రెడ్డి’.. ‘రంగస్థలం’ సినిమాలు కూడా తనకు చాలా నచ్చాయని త్రివిక్రమ్ చెప్పాడు. తమిళంలో ‘అరువి’ అద్భుతమైన సినిమా అని.. ఏమాత్రం అంచనాల్లేకుండా ఆ సినిమా చూశానని.. చివరికి వచ్చేసరికి అంతర్జాతీయ సినిమాలా అనిపించిందని త్రివిక్రమ్ చెప్పాడు. మీకు బాగా నచ్చిన.. జనాలకు సజెస్ట్ చేయగలిగే ఐదు పుస్తకాల పేర్లు చెప్పమని త్రివిక్రమ్ ను అడిగితే.. ముందుగా విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ గురించి చెప్పాడు. అది అద్భుతమైన పుస్తకం అన్నాడు. అలాగే బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ కూడా గొప్ప రచన అన్నాడు. శీలా వీర్రాజు రాసిన ‘మైనా’.. యద్దనపూడి సులోచనా రాణి ‘కీర్తి కిరీటాలు’.. డాక్టర్ పి.సుశీలాదేవి ‘కాలాతీత వ్యక్తులు’ కూడా చదవాల్సిన పుస్తకాలని చెప్పాడు త్రివిక్రమ్.