Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ పెద్ద కాంప్లిమెంటే ఇచ్చాడుగా..
By: Tupaki Desk | 28 Sep 2016 5:32 AM GMTనవీన్ విజయ్ కృష్ణ.. తెలుగు తెరకు పరిచయం కాబోతున్న కొత్త హీరో. సీనియర్ నటుడు నరేష్ కొడుకే ఈ నవీన్ అన్న సంగతి తెలిసిందే. ఐతే అతడి గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. అతను చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. నవీన్ స్వతహాగా ఎడిటర్. చాలా సినిమాలకు పని చేశాడు. త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే.. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ బెస్ట్ ఎడిటర్లలో నవీన్ ఒకడట.
నవీన్ హీరోగా పరిచయమవుతున్న ‘నందిని నర్సింగ్ హోమ్’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. త్రివిక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు నవీన్ తో ‘అతడు’ సినిమా దగ్గర్నుంచి పరిచయముంది. అప్పట్లో ఫిలిం ఫేర్ వాళ్లు ఆ కార్యక్రమం కోసం ఒక ఏవీ ఎడిట్ చేసి ఇవ్వమంటే నేను నవీన్ దగ్గరికే వెళ్లాను. చాలా బాగా చేసిచ్చాడు. అతను చాలా మంచి ఎడిటర్. సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఎడిటర్లలో వన్ ఆఫ్ ద బెస్ట్. హీరోగా అతను మంచి విజయం సాధించాలి. ఎడిటింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని చాలా బాధగా చెబుతున్నా’’ అని నవ్వేశాడు త్రివిక్రమ్.
మరోవైపు నవీన్ మిత్రుడైన సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘నవీన్.. నేను చిన్నప్పట్నుంచి స్నేహితులం. కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఒకే ట్యూషన్ మాస్టర్ దగ్గర దెబ్బలు తిన్నాం. ఒకే ప్లేట్లో దోసెను పంచుకున్నాం. ఇప్పుడు హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నాం. నవీన్ ఒక కొత్త ఛాప్టర్ మొదలుపెడుతున్నాడు. అతను సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/