Begin typing your search above and press return to search.

'అ..ఆ' మూలకథ యద్దనపూడిదే -త్రివిక్రమ్

By:  Tupaki Desk   |   4 Jun 2016 4:18 PM GMT
అ..ఆ మూలకథ యద్దనపూడిదే -త్రివిక్రమ్
X
అ..ఆ.. చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి ఓ వివాదం నడుస్తోంది. యద్దనపూడి సులోచనా రాణి రాసిన మీనా నవలను యాజిటీజ్ గా అ..ఆ.. పేరుతో త్రివిక్రమ్ తెరకెక్కించేశాడని అందరూ అంటున్నారు. కనీసం ఆమె పేరు కూడా నేమ్ కార్డ్స్ లో వేయకుండా.. ఆమెకు అన్యాయం చేశారనే మాట వినిపించింది. ఇప్పుడీ వివాదంపై నోరు విప్పాడు మాటల మాంత్రికుడు. అ..ఆ.. సక్సెస్ మీట్ లో భాగంగా మాట్లాడిన త్రివిక్రమ్.. తొలుత ఈ వివాదం గురించి వివరణ ఇవ్వడంతోనే ప్రారంభించాడు.

'ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసింనందుకు కృతజ్ఞతలు. ఈ సినిమాని స్టార్ట్ చేసేముందు 9 నెలల ముందే నాకు ఎంతో ఇష్టమైన రైటర్ యద్దనపూడి సులోచనా రాణిగారితో మాట్లాడాను. ఆమె నుంచి క్రియేటివ్ ఇన్ పుట్స్ తీసుకున్నాను. ఆమె కూడా కొన్ని కేరక్టర్లకు సంబంధించి చాలానే మార్పులు చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే అ..ఆ.. చిత్రానికి మూలకథకు యద్దనపూడి సులోచనారాణి గారి పేరువేయాలి. నిజానికి ఆమె పేరును థాంక్స్ కార్డ్ వేశాం కాని సాంకేతిక సమస్యల కారణంగా డిస్ ప్లే కాలేదు. ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించుకుని 48 గంటల్లోనే ఆమె పేరు డిస్ ప్లే వస్తుంది. ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోతుందని అనుకుంటున్నా. ఇంకా మాట్లాడాలని అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు' అని చెప్పాడు త్రివిక్రమ్.

వివాదం పెద్దదయ్యాక వివరణ ఇవ్వడం బాగానే ఉంది కానీ.. కామెడీ బిట్స్ హాలీవుడ్ సినిమాల నుంచి కొట్టేస్తే ఎవరూ మాట్లాడలేదని.. ఏకంగా స్టోరీ మొత్తాన్ని ఎత్తేయడం, ఇప్పుడు టెక్నాలజీ మిస్టేక్ అనేస్తే సరిపోతుందా అన్నదే అసలు పరిశ్రమ. మీరు మాటల మాంత్రికుడు కాబట్టి.. మాటలతో మాయ చేసేయడం సినిమాల వరకే సరిపోతుండీ.. బైట జనాలు అన్నీ గమనిస్తారు కదా త్రివిక్రమ్ జీ!