Begin typing your search above and press return to search.
కామెంట్:సోనియా గాంధీ గుర్తుకొస్తోంది త్రివిక్రమ్ జీ
By: Tupaki Desk | 5 Jun 2016 9:53 AM GMTఇంతకుముందు జనతా పార్టీ అధినేతగా ఉండి.. గత ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలోకి చేరిన తమిళ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పేరు చెబితే చాలు.. కాంగ్రెస్ పార్టీ షేకైపోతుంది. నెహ్రూ కుటుంబం అంటే ఆయనకు అస్సలు పడదు. అందుకే వారి లొసుగుల్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూ.. వారి గాలి తీయడానికి ప్రయత్నిస్తుంటాడు పెద్దాయన. ఏడాదిగా సంచలనం రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసును బయటికి తీసింది ఆయనే.
నెహ్రూ కుటుంబాన్ని.. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ఇంకా ఎన్నో విషయాల్ని ఆయన బయటపెట్టాడు. అందులో ఒకటి సోనియా చదువు గురించి ఆయన బట్టబయలు చేయడం. తన ఎన్నికల అఫిడవిట్లో తాను డిగ్రీ పూర్తి చేసినట్లు సోనియా గాంధీ పేర్కొందని.. ఐతే ఆమె కాలేజీ మెట్లే ఎక్కలేదని.. స్కూల్ దశలోనే చదువు మానేసిందని అందరికీ తెలిసేలా చేశాడు స్వామి. దీనిపై సోనియా గాంధీ అండ్ కో స్పందిస్తూ.. అఫిడవిల్లో డిగ్రీ చదివినట్లు పేర్కొనడం ‘టైపింగ్ మిస్టేక్’ అని జవాబిచ్చారు. దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద టైపింగ్ మిస్టేక్ గా గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలంటూ తనదైన శైలిలో సెటైర్ వేశారు సుబ్రమణ్యస్వామి. ఈ మేటర్ ఇక్కడ హోల్డ్ లో పెట్టి ఓ కొత్త విషయం గురించి మాట్లాడుకుందాం.
నిన్న ‘అఆ’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఈ సినిమా కథ విషయంలో నెలకొన్న వివాదం మీద స్పందించాడు త్రివిక్రమ్. తన కథకు యద్దనపూడి సులోచనారాణి రాసిన నవలే స్ఫూర్తి అని.. ఒక రకంగా ఈ చిత్రానికి మూల కథ అంటూ ఆమె పేరే టైటిల్స్ లో వేయాలని.. నిజానికి థ్యాంక్స్ క్రెడిట్స్ లో ఆమె పేరు వేసినా సాంకేతిక కారణాల వల్ల డిస్ ప్లే కాలేదని సెలవిచ్చాడు త్రివిక్రమ్. ఇది సోనియా గాంధీ టైపింగ్ మిస్టేక్ వ్యవహారం లాగే ఉంది. ఒకరకంగా మూల కథే ఆమెది అంటున్న త్రివిక్రమ్.. కచ్చితంగా ఆ క్రెడిట్ ఇవ్వాలి. థ్యాంక్స్ క్రెడిట్ ఇస్తే అది సాంకేతిక కారణాలతో డిస్ ప్లే కాలేదని చెప్పడం త్రివిక్రమ్ స్థాయి వ్యక్తి ఎంతమాత్రం తగని మాట. ఇది ఎంతమాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. త్రివిక్రమ్ చేసింది ముమ్మాటికీ తప్పు. మళ్లీ దాన్ని ఇలా సమర్థించుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. త్రివిక్రమ్ నుంచి మరింత హుందాతనం కోరుకుని ఉంటారు ఆయన అభిమానులు.