Begin typing your search above and press return to search.

త‌ప్పు చేసి దొరికిపోయిన యువ‌న‌టికి మాయావి క్లాస్!

By:  Tupaki Desk   |   27 Feb 2022 10:00 PM IST
త‌ప్పు చేసి దొరికిపోయిన యువ‌న‌టికి మాయావి క్లాస్!
X
డే -1.. డే- 2 `భీమ్లా నాయక్` అద‌ర‌గొట్టేశాడు. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. దీంతో టీమ్ మొత్తం ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటోంది. అయితే పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ కు హాజరు కానప్పటికీ సక్సెస్ పార్టీలో తన ఉనికిని చాటేలా చూసుకున్నాడు. అయితే ఈ క్రెడిట్ మాత్రం స‌ద‌రు యువ‌న‌టికి ఇవ్వాల్సిందే.

భీమ్లా నాయక్ లో కనిపించిన ఒక యువ నటి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పార్టీ నుండి పవన్ కళ్యాణ్ వీడియోను రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. గత రాత్రి మిడ్ నైట్ పార్టీలో పాల్గొన్న‌ట్టు ఈ విజువల్ వైరల్ అయ్యింది. అయితే కొద్దిసేపటికే దాదాపు అన్ని టీవీ ఛానెల్ లు ఈ విజువ‌ల్స్ ని ఉపయోగించాయి.

అదేవిధంగా ఇది సోషల్ మీడియాలోకి కూడా వచ్చింది. కానీ ఇంత‌లోనే త‌న తప్పేంటో తెలుసుకుంది. అయితే ఈ లీక్ తీవ్రతను అర్థం చేసుకున్న నటి వెంటనే దర్శకుడు త్రివిక్రమ్ వద్దకు వెళ్లి తన తప్పును అంగీకరించినట్లు సమాచారం. త్రివిక్రమ్ అలాంటి ఫోటోల్ని లీక్ చేయాల‌ని తాను కోరుకోనప్పటికీ విడుదల చేసిన తర్వాత ఆమె లేదా ఎవరైనా చేయగలిగేది ఏమీ లేదని అతను స‌ద‌రు నటికి చెప్పాడట‌.

త‌ప్పు చేసి దొరికిపోయినా కానీ యువ నటి దానికి సంతోషించి ఉండవచ్చు. మొత్తానికి సోష‌ల్ మీడియాలో త‌న‌కు కూడా ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగింది భీమ్లా వ‌ల్ల‌. అలాంటి ఫోటోల‌ను లీకిస్తే ఏం జరుగుతుందని ఎప్పుడూ తాను ఊహించి ఉండ‌దు.

కానీ ఊహించ‌నిది జ‌రిగేలా చేయ‌డమే ప‌వ‌ర్ స్టార్ లెక్క‌. ఇప్పుడు ఏపీలో అత‌డు బ్రేక్ ఈవెన్ ఇవ్వ‌డం చాలా అవ‌స‌రం. దానికోసం భీమ్లా నాయ‌క్ రెండు వారాలు ఆడించాల్సి ఉంటుంది. మ‌రి ప‌వ‌న్ వివాదాల‌తో కాకుండా త‌నదైన శైలి ప్ర‌చారంతో ఏపీలో మ‌రింత‌గా ఊపు తెస్తాడేమో జ‌నాల్ని థియేట‌ర్ల‌కు రిపీటెడ్ గా రప్పిస్తాడేమో చూడాలి.