Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ఫెయిల్.. కొరటాల సక్సెస్!
By: Tupaki Desk | 24 May 2022 9:31 AM GMT'ట్రిపుల్ ఆర్' తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగానూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఈ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ భారీ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ 30 వ సినిమాగా తెరపైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన డైలాగ్ మోషన్ పోస్టర్ ని ఇటీవల మే 20న మేకర్స్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన మోషన్ టీజర్ ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని ఆకట్టుకుని పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే కాన్ఫిడెంన్స్ ని కలిగించింది. డార్క్ విజువల్స్ నేపథ్యంలో సాగిన ఈ మోషన్ పోస్టర్ లో అనిరుధ్ అందించిన సంగీతం మరింత హైలైట్ గా నిలిచి సినిమా ఓ రేంజ్ లో వుండబోతోందనే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.
అనిరుధ్ ఈ స్థాయిలో మోషన్ టీజర్ కి సంగీతం అందించడంతో దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయన పాత్ర చాలా వుంది కాబట్టే ఈ రేంజ్ అవుట్ పుట్ వచ్చేసింది.
అయితే అనిరుధ్ తను పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పాటలకు ఫరవాలేదనిపించినా నేపథ్య సంగీతం విషయంలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే అనిరుధ్ ఈ సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడు.
ఇందుకు త్రివిక్రమ్ కూడా బాధ్యుడయ్యాడు. ఆయన కరెక్ట్ గా కన్వే చేయలేకపోవడం, అనిరుధ్ కి తెలుగు భాషపై పట్టులేకపోవడంతో 'అజ్ఞాతవాసి' విషయంలో ఆశించిన స్థాయి సంగీతాన్ని అనిరుధ్ అందింవ్వలేకపోయాడు. ఈ విషయాన్ని గ్రహించిన తివిక్రమ్ ఇకపై తెలుగు సినిమా చేస్తే తెలుగు భాష నేర్చుకుని భాసపై పట్టు సాధించాకే చేయమని సలహా ఇచ్చారట. ఇప్పడు ఎన్టీఆర్ 30కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
రీసెంట్ గా డైలాగ్ మోషన్ పోస్టర్ రిలీజ్ కావడంతో అందులో అనిరుధ్ సంగీతం హైలైట్ కావడంతో త్రివిక్రమ్ .. అనిరుథ్ నుంచి కావాల్సిన సంగీతాన్ని రాబట్టడంలో ఫెయిల్ అయితే కొరటాల శివ సక్సెస్ అయ్ఆయడని కామెంట్ లు చేస్తున్నారు. అజ్ఞాతవాసి' విషయంలో అనిరుధ్ ఎక్డ ఫెయిల్ అయ్యాడో సరిగ్గా పట్టేసిన కొరటాల ఆ విషయంలో తన నుంచి బెస్ట్ ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ 30 డైలాగ్ మోషన్ పోస్టర్ బీజీఎం అదిరిందని, సినిమాలో నేపథ్య సంగీతం ఓ రేంజ్ లో వుంటుందనే కామెంట్ లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.