Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసి నష్టాలు 25 కోట్లు భరించారట

By:  Tupaki Desk   |   27 May 2018 4:19 AM GMT
అజ్ఞాతవాసి నష్టాలు 25 కోట్లు భరించారట
X
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అజ్ఞాతవాసి’ తెలుగు సినీ చరిత్రలోనే అది పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. రూ.90 కోట్ల దాకా ఈ చిత్రానికి బిజినెస్ 60 శాతం మాత్రమే బయ్యర్ల పెట్టుబడి వెనక్కి వచ్చింది. ఈ దెబ్బతో బయ్యర్లు నిండా మునిగిపోయినట్లే అనుకున్నారంతా. ఐతే బయ్యర్లను ఆదుకోవడానికి నిర్మాత రాధాకృష్ణ ముందుకొచ్చాడని.. కొంతమేర ఏదో సెటిల్ చేశాడని వార్తలొచ్చాయి. ఐతే హీరో పవన్ కళ్యాణ్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం బయ్యర్లను ఆదుకునేందుకు తమ వంతుగా ఏమీ చేయలేదన్న గుసగుసలు వినిపించాయి. ఐతే అది నిజం కాదంటున్నాడు త్రివిక్రమ్. నిర్మాతతో కలిసి తాను.. పవన్ కూడా చేతులు కలిపి బయ్యర్ల నష్టాలు సెటిల్ చేసినట్లు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు త్రివిక్రమ్.

ఎప్పుడూ తన సినిమాలకు సంబంధించిన ఫైనాన్షియల్ వ్యవహారాల గురించి మాట్లాడని త్రివిక్రమ్.. ‘అజ్ఞాతవాసి’ విషయంలో మాత్రం ఓపెనయ్యాడు. బహుశా తమ మీద జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాలనే ఈ ప్రయత్నం చేశాడేమో. ‘‘అజ్ఞాతవాసి సినిమా వల్ల బయ్యర్లకు నష్టాలొచ్చాయని అర్థమైంది. రూ.90 కోట్లకు కొన్నారు. రూ.60 కోట్ల దాకా వచ్చింది. రూ.30 కోట్లు సర్దాలన్నమాట. నేను.. కళ్యాణ్ గారు.. నిర్మాత.. ముగ్గురూ కలిసి పాతిక కోట్లు సర్దుబాటు చేశాం. ‘అజ్ఞాతవాసి’ వచ్చిన వారం రోజులకు ఎవరి డబ్బులు వాళ్లకు ఇచ్చేశాం. ఇదేదో మేం గొప్పోళ్లని చెప్పుకోవడానికి కాదు. మనల్ని నమ్మిన వాడు ఎందుకు చెడిపోవాలి అనే విధంగా కళ్యాణ్ ఆలోచనలుంటాయి’’ అని వివరించాడు త్రివిక్రమ్. మొత్తానికి ‘అజ్ఞాతవాసి’ నష్టాలు.. బయ్యర్ల కష్టాల గురించి జనాల్లో ఉన్న రకరకాల సందేహాలకు త్రివిక్రమ్ ఇలా తెరదించేసి మంచి పనే చేశాడు.