Begin typing your search above and press return to search.
అల బ్రహ్మీ పై గౌరవం చూపించాడా?
By: Tupaki Desk | 13 Jan 2020 6:48 AM GMTహాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈమద్య కాలంలో అసలు కనిపించడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే ఖచ్చితంగా ఆయన ఉండేవాడు. ఆయన డేట్లు సర్దుబాటు కాకుంటే కొన్ని సార్లు స్టార్ హీరోల సినిమాలు ఆగిన సందర్బాలు కూడా ఉన్నాయి. బ్రహ్మానందం లేకుండా సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం వెనుకంజ వేసేవారు. అలాంటి క్రేజ్ ను దక్కించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు సినిమాల్లో కనిపించడమే కష్టం అయ్యింది. ఆయన రొటీన్ పాత్రలను ప్రేక్షకులు మెప్పించలేక పోయాయి. దాంతో ఆయన్ను దర్శకులు సినిమాలకు దూరం పెడుతున్నారు.
ఆయనపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల వారిలో అపారమైన గౌరవం అయితే ఉంది. కాని ఆయనకు అవకాశాలు మాత్రం ఇచ్చేందుకు ఎవరు సాహసించడం లేదు. బ్రహ్మానందం ఉంటే ఒకప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేవారు. కాని ఇప్పుడు బ్రహ్మానందం ఉంటే సినిమా ఆడుతుందా లేదా అనే అనుమానాలు ఉంటున్నాయి. ఆయన కామెడీ ఎబ్బెట్టుగా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆయన అంటే అమితమైన అభిమానం ఉన్న వారు కూడా ఆయనతో వర్క్ చేయలని పరిస్థితి.
అయితే కొందరు దర్శకులు మాత్రం ఆయనపై గౌరవంతో గెస్ట్ అప్పియరెన్స్ గా తమ సినిమాల్లో ఆయన్ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా త్రివిక్రమ్ కూడా తన అల వైకుంఠపురంలో సినిమా లో బ్రహ్మానందంను చూపించాడు. రాములో రాముల పాటలో కొద్ది సెకన్లు మాత్రమే బ్రహ్మానందం కనిపించాడు. బ్రహ్మానందం ఆ మద్య అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించుకున్న విషయం తెల్సిందే. ఆ కారణంగా ఆయన మొహంలో కూడా కాస్త తగ్గినట్లుగా అనిపించింది. బ్రహ్మానందం మళ్లీ ఫామ్ లోకి వస్తాడని ఆశిస్తున్న వారికి వైకుంఠపురంలో ఆయన్ను చూస్తే నిరాశ కలుగక మానదు. బ్రహ్మానందం ఒక చరిత్రగానే మిగిలి పోతాడని.. మళ్లీ ఆయన టాలీవుడ్ లో ఎంటర్ టైన్ చేయడం కష్టమే అని సినీ వర్గాల వారు అంటున్నారు.