Begin typing your search above and press return to search.
20 ఏళ్లుగా త్రివిక్రమ్ రెంట్ చెల్లిస్తున్నాడు
By: Tupaki Desk | 31 Aug 2021 8:57 AM GMTటాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ రచయితగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఒకానొక సమయంలో ఆఫర్లు లేక.. ఆర్థికంగా ఇబ్బంది పడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి. అలాంటి త్రివిక్రమ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరు అనడంలో సందేహం లేదు. ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో త్రివిక్రమ్ పంజాగుట్టలో సునీల్ ఇంకా కొందరితో కలిసి ఉండేవాడు. ఆ సమయంలోనే రచయితగా బిజీ అయ్యాడు. అందుకే ఆ రూమ్ ను సెంటిమెంట్ గా త్రివిక్రమ్ కొనసాగిస్తూ వస్తున్నాడు.
పంజాగుట్టలో ఆ రూములో త్రివిక్రమ్.. దశరథ్ మరియు సునీల్ లు ఉండేవారు. ముగ్గురు కూడా బిజీ అయ్యారు. త్రివిక్రమ్ మాత్రం ఆ ఇంటిని వదిలి పెట్టలేదు. తాను ఒక సెంటిమెంట్ గా భావించి ఆ ఇంటికి రెంటు చెల్లిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఆ రూము తన పరిథిలోనే త్రివిక్రమ్ ఉంచుకున్నాడు. దాదాపుగా ఇరవై ఏళ్లుగా త్రివిక్రమ్ ఆ రూము కు రెంటు చెల్లిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆ రూముకు ఇప్పటికి కూడా వెళ్తూ ఉంటాడని ఆయన సన్నిహితులు శిష్యులు అంటూ ఉన్నారు. త్రివిక్రమ్ సెంటిమెంట్ లను ఎక్కువగా పట్టించుకోడు అనిపిస్తుంది. కాని ఆయన రూము విషయంలో మాత్రం సెంటిమెంట్ గా రెంటు చెల్లిస్తూ ఉన్నాడు.
ఇప్పటికి కూడా ఆ రూముకు ఓనర్ కు అయిదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉన్నాడట. ఆ రూము ఎంతో మంది అడిగినా ఎక్కువ రేటుకు ఇవ్వమన్నా కూడా ఆ ఓనర్ కూడా త్రివిక్రమ్ కోసమే ఇంకా అలాగే ఉంచుతున్నారట. మొత్తానికి ఆ ఇల్లు విషయం.. త్రివిక్రమ్ చెల్లిస్తున్న రెంటు విషయం ఎంతో మందికి ఆశ్చర్యంగానే ఉంటుంది. పది పదిహేను సంవత్సరాలుగా ఆ విషయం చర్చనీయాంశంగానే ఉంటుంది. తాజాగా మరోసారి త్రివిక్రమ్ అద్దె రూము గురించిన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా కోసం రెడీ అవుతున్న త్రివిక్రమ్ మరో ఇండస్ట్రీ ఖాయంగా దక్కించుకుంటాడు అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.