Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చినట్టేనా?
By: Tupaki Desk | 2 Sep 2019 8:43 AM GMTగతేడాది 'అరవింద సమేత' తో హిట్ ట్రాక్ ఎక్కిన త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో 'అల వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అంటూ అనౌన్స్ చేసేసారు. అయితే మొన్నీ మధ్య టైటిల్ అనౌన్స్ చేసి గ్లిమ్స్ వదిలిన త్రివిక్రమ్ వినాయక చవితి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్నీ సూటు బూటు వేసుకొని దర్జాగా ఓ ఇంటి ముందు కూర్చుని వాచ్ మెన్ తో సిగరెట్ వెలిగించుకుంటాడు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ తో కథ ఏంటో హింట్ ఇచ్చాడు మాటల మాంత్రికుడు. నిజానికి బన్నీ కోట్ల రూపాయల ఆస్తి ను వదిలి టబు ఇంటికి వెళ్లి అక్కడ ఓ సామాన్యుడిలా ఉంటాడని అదే సినిమా కథాంశం అని టాక్. అందుకే టబు ఇంటి పేరును సినిమా టైటిల్ గా పెట్టారట. అయితే పాయింట్ 'అత్తారింటికి దారేది' లాగే ఉన్నా ఇందులోత్రివిక్రమ్ కాస్త డిఫరెంట్ స్క్రీన్ ప్లే వాడబోతున్నాడని తెలుస్తుంది. అది కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా త్రివిక్రమ్ స్టైల్ లొనే ఉంటుందని అంటున్నారు. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ తో తను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చెప్తూ పోస్టర్ వదిలారేమో.
నిజానికి హీరో తన ఇల్లు వదిలి మరో ఇంటికెళ్లి అక్కడ కొన్ని రోజులు వాళ్లలో ఒకడిగా ఉండటం అనేది త్రివిక్రమ్ రెండు సినిమాల్లో చూసాం. 'అత్తారింటికి దారేది' లో అత్త ను తన తాత దగ్గరికి చేర్చడం కోసం పవన్ అత్తారింటికి వెళ్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో తన ఆస్తి దక్కించుకోవడం కోసం ఓ రౌడీ ఇంటికెళతాడు బన్నీ. మరి ఈసారి తన హీరో వైకుంఠపురము అనే ఇంటికెళ్లడానికి త్రివిక్రమ్ ఎలాంటి రీజన్ చెప్తాడో.. ఎలా మేజిక్ చేస్తాడో.