Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ చూపు హాలీవుడ్ వైపు...!
By: Tupaki Desk | 4 Jan 2019 6:29 PM GMTమాటల మాంత్రికుడు.. గురూజీ.. ఇలా రెండు మూడు బిరుదులున్నాయి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు. కానీ విమర్శకులు మాత్రం త్రివిక్రమ్ తన సినిమాల మూల కథలను పాత నవలల నుండి లేదా హాలీవుడ్ సినిమాలనుండి మహా నేర్పుగా తీసుకొస్తాడని సున్నితంగా విమర్శిస్తుంటారు. ఇవన్నీ అయన పట్టించుకోడు లెండి.. అది పూర్తిగా వేరే విషయం.
త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకు దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. బన్నీ ఎంతో కాలం దర్శకుల కోసం వెతికి వెతికి ఫైనల్ గా గురూజీ దగ్గర ఆగాడు. ఈమధ్యనే త్రివిక్రమ్ చెప్పిన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ కథ మూలాలపై అప్పుడే ఇన్ స్పిరేషన్ ఆరోపణలు తెరపైకి రావడం విశేషం. ఈ సినిమా కథ 2009 లో విడుదలైన 'ది ఇన్వెన్షన్ ఆఫై లైయింగ్' అనే హాలీవుడ్ లో సినిమాను స్ఫూర్తిగా తీసుకొని త్రివిక్రమ్ రాసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో హీరో ఎప్పుడు నిజాలే చెప్పే వ్యక్తి. కానీ ఈ వ్యక్తి అనుకోని పరిస్థితులలో వరసగా అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆఖరికి అవే అబద్ధాలను నిజం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కథను మన గురూజీ తండ్రి కొడుకుల మధ్య జరిగే కథగా మార్చి రాసినట్టుగా టాక్ వినిపిస్తోంది. అంటే తండ్రి చెప్పే అబద్దాలను నిజం చేసే కొడుకుగా బన్నీ నటిస్తాడన్నమాట. ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇదే. మరి గురూజీ నిజంగా ఈ సినిమాకథనే ప్రేరణగా తీసుకున్నాడా లేదా అనేది తెలియాలంటే మనం కొంత కాలం వేచి చూడకతప్పదు.