Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ఇలా ‘క్యాష్’ చేసుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   6 April 2020 5:30 PM GMT
త్రివిక్రమ్ ఇలా ‘క్యాష్’ చేసుకుంటున్నాడా?
X
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణి ఇప్పుడున్న టాలీవుడ్ పరిశ్రమలో ఉందంటారు. ఒక్క హిట్ కొట్టగానే కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని.. బడా హీరోలతో సినిమా చేసి జీవితంలో సెటిల్ అయ్యేలా డబ్బు కూడబెట్టుకోవాలని పరిశ్రమలోని దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే మొదటి నుంచి రచయితగా కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా మారిన త్రివిక్రమ్ మాత్రం ఇలా డబ్బు కోసం కాకుండా కథను బట్టి హీరోలను ఎంచుకొని హిట్స్ కొడుతూ వస్తున్నాడు. ఆ మధ్య నాగార్జున కుమారుడు అఖిల్ ఎంట్రీ మూవీకి దర్శకత్వం ఆఫర్ వచ్చినా తిరస్కరించినట్టు టాలీవుడ్ లో ప్రచారం ఉంది. డబ్బు కోసం కాకుండా విలువల కోసం పని చేస్తాను అనేలా ఆయన చర్యలు, మాటలు ఉంటాయంటారు.

అయితే తాజాగా ఇదివరకు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక బడా పారిశ్రామిక వేత్త కొడుకును ఇండస్ట్రీకి లాంచ్ చేయడానికి త్రివిక్రమ్ ఒప్పుకున్నాడన్న వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. త్రివిక్రమ్ చేస్తాడా? చేయడా అన్నది పక్కన పెడితే ఏకంగా 170 కోట్ల బడ్జెట్ అని.. 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం సాగుతోంది. ఇది నిజమా కాదా తెలియదు కానీ.. వైరల్ మాత్రం అవుతోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో తీస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ముగిశాక ఎన్టీఆర్ ఈ త్రివిక్రమ్ తో చిత్రం చేస్తాడని సమాచారం. ఈ సినిమా ముగిశాకే త్రివిక్రమ్ కొత్త హీరోతో కొత్త చిత్రం చేస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.