Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ను ఇబ్బంది పెట్టిన ఆ ఇద్దరెవరు?
By: Tupaki Desk | 6 Jun 2016 7:45 AM GMTత్రివిక్రమ్ లాంటి టాప్ లీడ్ డైరెక్టర్ ఒక బేనర్లో వరుసగా మూడు సినిమాలకు దర్శకత్వం వహించడం.. అదే బేనర్లో ఇంకో సినిమాకు కమిటవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎలా కనెక్టయిపోయాడో కానీ.. ‘హారిక హాసిని క్రియేషన్స్’ అధినేత రాధాకృష్ణ త్రివిక్రమ్ కు బాగా కనెక్టయిపోయాడు. జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి.. అఆ.. ఇలా ఆ బేనర్లో వరుసగా మూడు సినిమాలు చేసి ఇంకో సినిమాకు కూడా కమిట్మెంట్ ఇచ్చాడు. తాను ఎక్కువ పారితోషకం ఇవ్వడమే త్రివిక్రమ్ వరుసగా తన బేనర్లో సినిమాలు చేయడానికి కారణం అనుకుంటారు కానీ.. నిజానికి తనతో ఉన్న కంఫర్టే అందుకు కారణమని చెప్పాడు రాధాకృష్ణ. అంతే కాక త్రివిక్రమ్ కు ఇద్దరు నిర్మాతలతో చేదు అనుభవాలు ఎదురయ్యాయని కూడా మొన్నో ఇంటర్వ్యూలో వెల్లడించాడు రాధాకృష్ణ.
దీంతో ఎవరా ఇద్దరు నిర్మాతలు అనే చర్చ మొదలైంది టాలీవుడ్లో. త్రివిక్రమ్ ఫస్ట్ టైం బాగా ఇబ్బంది పడింది ‘ఖలేజా’ నిర్మాత శింగనమల రమేష్ వల్ల. అతను ఓ పెద్ద ఆర్థిక వివాదంలో చిక్కుకున్నాడు. ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడింది. ‘ఖలేజా’ బాగా లేటు కావడానికి అది కూడా ఓ కారణం. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ వల్ల కూడా త్రివిక్రమ్ ఇబ్బంది పడ్డాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో.. విడుదల సమయంలో సమస్యలేవీ బయటపడలేదు కానీ.. ఆ తర్వాత పారితోషకం బ్యాలెన్స్ పెట్టాడంటూ పవన్ తో కలిసి త్రివిక్రమ్.. ప్రసాద్ మీద ఫిర్యాదు చేయడం తెలిసిన సంగతే. ఇలా వరుసగా ఇద్దరు నిర్మాతలు ఇబ్బంది పెట్టేసరికి తనకు కంఫర్టబుల్ గా ఉన్న బేనర్లో వరుసగా సినిమాలు చేసుకుంటున్నాడు త్రివిక్రమ్. ‘హారిక హాసిని క్రియేషన్స్’ ఒకరకంగా త్రివిక్రమ్ కు హోం బేనర్ అని.. అతను అందులో నిర్మాణ భాగస్వామి కూడా అని ఇండస్ట్రీ జనాలు అనుకుంటుంటారు.