Begin typing your search above and press return to search.

అంతా త్రివిక్రమే.. అందులో డౌట్ లేదు

By:  Tupaki Desk   |   7 Feb 2018 11:46 AM GMT
అంతా త్రివిక్రమే.. అందులో డౌట్ లేదు
X
ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు కేవలం ఎనౌన్సుమెంటుతోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అటువంటి సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు నితిన్ హీరోగా రూపొందుతున్న సినిమా గురించే చెప్పుకోవాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మరియు త్రివిక్రమ్ లు స్వయంగా నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ తో కలసి లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరక్షన్లో నిర్మిస్తున్న సినిమా తాలూకు ఓపెనింగ్ ఈవెంట్ అందరినీ స్టన్ చేసింది. గత సంవత్సరం నవంబర్లో వచ్చిన ఈ ప్రకటన తరువాత.. మొన్న నితిన్ ఈ సినిమా తాలూకు ఇతర డేట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏప్రియల్ 5న విడుదలయ్యే ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 12న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏం చేశాడు అనే విషయం గురించి ఇప్పుడు పలు ఆసక్తికరమైన సంగతులు తెలుస్తున్నాయి. నిజానికి లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య తీసిన రౌడీ ఫెలో సినిమా అంటే త్రివిక్రమ్ కు చాలా ఇష్టం. ఆ విషయం స్వయంగా అనేకసార్లు చెప్పాడు. అయితే కృష్ణచైతన్యకు ఒక కథను చెప్పి.. ఆ కథను నువ్వే డైరక్ట్ చేయాలి అన్నాడట. అదే ఈ నితిన్ సినిమా. పైగా దానిని నేనే ప్రొడ్యూస్ చేస్తా అంటూ.. సినిమా కోసం అనేక క్రియేటివ్ ఇన్ పుట్స్ ఇస్తూ.. దగ్గరుండి నిర్మాణం చూసుకుంటూ.. ఈ ప్రాజెక్టుకు వెన్నెముకలా నిలిచాడట. ఇటు దర్శకుడు కృష్ణ చైతన్య కాని అటు హీరో నితిన్ కాని ఈ సినిమాను త్రివిక్రమ్ సారధ్యంలో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి కాస్త తేడా కొట్టేయడంతో ఆయనపై అనేక సందేహాలు వస్తున్నాయి కాని.. ఆయన రాసిన ఒక కథ ఎలా ఉంటుందో చూడాలంటే ఈ నితిన్ సినిమాను చూడాలని అంటున్నారు సన్నిహితులు. ఆ మద్యన వచ్చిన 'లై' సినిమాలో నితిన్ తో ఆడిపాడిన మేఘా ఆకాష్ ఇప్పుడు మరోసారి ఈ సినిమాలో మెరవనుంది. అది సంగతి.