Begin typing your search above and press return to search.

మాయావిని వ‌దల‌ని నితిన్.. ఏంటి క‌థ‌?

By:  Tupaki Desk   |   16 Feb 2020 3:30 PM GMT
మాయావిని వ‌దల‌ని నితిన్.. ఏంటి క‌థ‌?
X
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో నితిన్ అనుబంధం గురించి తెలిసిందే. యూత్ స్టార్ కి `అఆ` లాంటి కెరీర్ బెస్ట్ హిట్ ని ఇచ్చాడు త్రివిక్ర‌ముడు. ఓవర్సీస్ లోనూ నితిన్ ని మ‌రో మెట్టు ఎక్కించాడు. అఆ త‌ర్వాత మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తో సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించినా అది వెంట‌నే సాధ్య‌ప‌డ‌లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ .. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్స్ తో త్రివిక్ర‌మ్ వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌వ్వ‌డంతో నితిన్ కి మ‌రో అవ‌కాశం లేకుండా పోయింది. అయినా యంగ్ హీరో మాత్రం మాయావిని వ‌దిలేట్టు లేడు.

ప‌దే ప‌దే త‌న‌తో మ‌రో సినిమా చేయాల‌న్న కసితో ఉన్నాడు. అఆ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి క్లాసిక్ హిట్ నితిన్ కెరీర్ కి లేదు. వ‌రుస‌గా కొన్ని సినిమాలు చేసినా అన్నీ ఫ్లాపుల‌య్యాయి. దీంతో తిరిగి బండిని ట్రాక్ లోకి తెచ్చేందుకు చాలానే శ్ర‌మించాల్సొస్తోంది. ప్ర‌స్తుతం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ చిత్రం చేశాడు. ఈనెల 21న‌ సినిమా రిలీజ‌వుతోంది. ఈ సోమ‌వారం (17 ఫిబ్ర‌వ‌రి) హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చిత్ర‌బృందం ప్లాన్ చేసింది. అంతేకాదు ఈవెంట్ కి త్రివిక్ర‌మ్ ని ఏరి కోరి ముఖ్య అతిథిగా భీష్మ టీమ్ ఆహ్వానించింది. భీష్మ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో త్రివిక్రమ్ రిలేష‌న్ మాట ఎలా ఉన్నా.. నితిన్ ప్ర‌త్యేకంగా త్రివిక్రమ్ నే అతిధిగా ఆహ్వానించ‌డంపై ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అస‌లింత‌కీ నితిన్ త్రివిక్ర‌మ్ వెంటే ఎందుకు ప‌డుతున్నాడు? గెస్టులుగా స్టార్ హీరోల్ని.. ఇత‌ర ఇండ‌స్ట్రీ స్నేహితుల్ని పిల‌వొచ్చు క‌దా! అంటూ లాజిక్ ని క‌నిపెట్టేశారు ఫ్యాన్స్. నితిన్ కి అర్జెంటుగా త్రివిక్ర‌మ్ నుంచి ఆఫ‌ర్ కావాలి. అందుకే ఇంత‌గా త‌పిస్తున్నాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఆ త‌ర్వాత ఆ సినిమాకి సీక్వెల్ తీస్తామ‌ని అన్నారు. కానీ దానికి సంబంధించి త్రివిక్ర‌మ్ ఎలాంటి ప‌నులు మొద‌లు పెట్ట‌లేదు. ఇప్ప‌టికైనా యూత్ స్టార్ పై మాయావి దృష్టి సారిస్తాడా? అంటే ఇప్ప‌ట్లో ఆ సీన్ అయితే క‌నిపించ‌డం లేదు. ఎన్టీఆర్.. మ‌హేష్.. అల్లు అర్జున్.. చ‌ర‌ణ్ ఇలా టాప్ స్టార్లంతా అతడి క్యూలో ఉన్నారు. వాళ్ల‌ను కాద‌ని త్రివిక్ర‌మ్ నితిన్ తో సినిమా చేసే వీలుందా? అంటే ఇప్ప‌టికి క్లారిటీ లేదు.