Begin typing your search above and press return to search.
నిప్పంటించాను .. కొట్టుకు చావండిక
By: Tupaki Desk | 11 Jan 2020 5:30 AM GMTలోక కల్యాణం కోసం ముల్లోకాలు తిరిగి పితూరీలు మోస్తుంటాడు నారద మహర్షి. అయితే ఆయన చేసేదంతా లోక కల్యాణం కోసం.. జనహితం కోసం. అయితే అలాంటి మేలు చేసేందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేయాల్సిందంతా చేసాడట! ఇంతకీ ఏం చేశాడు అంటే..?
జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో తలమునకలుగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలపై అనాసక్తిగా ఉంటే... కాదూ కూడదు తప్పకుండా మీరు ముఖానికి రంగేసుకోవాల్సిందేనన్న ప్రోద్బలానికి కారకుడయ్యాడట. అందుకోసం పవన్ - దిల్ రాజు బృందాన్ని కలిపి పింక్ సినిమాని వీక్షించాల్సిందిగా ప్రివ్యూ థియేటర్ లో కూచోబెట్టారట.
ఆ ఒక్క సాయంతోనే పింక్ రీమేక్ మొదలైంది. ఆయన చేతులు దులుపుకున్నారు కానీ.. ఇప్పుడు దిల్ రాజుకే అసలు టెన్షన్ పట్టుకుంది. ఓవైపు జనసేన కార్యకలాపాలతో పవన్ ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. ఓవైపు పింక్ రీమేక్ కి అంగీకరించినా అటు రాజధాని టెన్షన్ తో ఏదీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇటు రాలేడు.. అక్కడ ఉండలేడు! అన్నట్టుగానే ఉంది సన్నివేశం. రాజకీయంగా కీలకమైన తరుణమిది. రాజధాని రైతుల తరపున పోరాడుతున్న పవన్ అక్కడ నిరూపించుకోవాల్సిన సమయమిది. అందువల్ల పింక్ రీమేక్ లో పవన్ నటిస్తారా లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. మొత్తానికి త్రివిక్రమ్ ఈ సినిమాకి ఎలా సాయమవుతున్నారో ఆయనే చెప్పేశారు కాబట్టి త్రివిక్రమ్ ఈ చిత్రానికి డైలాగులు రాస్తున్నారని రచనా సహకారం చేస్తున్నారని సాగుతున్న ప్రచారంపైనా ప్రశ్నిస్తే.. అసలు తన పాత్ర కేవలం నాదర మహర్షి పాత్ర మాత్రమేనని తేల్చేశాడు. అంటే ఆయన కేవలం పవన్ - దిల్ రాజు బృందాన్ని కలిపే ప్రయత్నం చేశారు తప్ప ఈ సినిమాలో ఇంకే విధంగానూ ఆయన రోల్ లేదన్నమాట. నిప్పంటించాను .. కొట్టుకు చావండిక అన్నట్టుగానే ఉంది కదూ?