Begin typing your search above and press return to search.
`అల వైకుంఠపురములో` అంత హిట్టు చాలదు!
By: Tupaki Desk | 24 Jun 2022 11:30 PM GMTఅల వైకుంఠపురములో` చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటి. ఈ సినిమా అతడి 18 ఏళ్ల కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డులు తిరగరాసింది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. 2020లో విడుదలైన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులకు బన్ని అభిమానులకు స్పెషల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు.
ఇంత పెద్ద ఇండస్ట్రీ హిట్ ని తెరకెక్కించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన ఇప్పుడు మహేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అతడు - ఖలేజా తర్వాత హ్యాట్రిక్ కోసం ఈ జోడీ కలిసి పని చేస్తున్నారు.
అయితే మహేష్ తో త్రివిక్రమ్ ఎలాంటి సినిమా తీయబోతున్నారు? అన్నదానికి సరైన క్లారిటీ లేదు. మారిన ట్రెండ్ లో ఇప్పుడు మహేష్ ని పాన్ ఇండియా కథాంశంలో చూపిస్తున్నారా? లేక తన జానర్ ని మార్చకుండా అల వైకుంఠపురములో తరహా క్లాసిక్ మూవీలో చూపిస్తున్నారా? అన్నది ఆసక్తిగా మారింది.
త్రివిక్రమ్ అంటే తనకంటూ ఒక బ్రాండ్.. ట్రేడ్ మార్క్ ఉందని నిరూపించిన దర్శకుడు. చక్కని హాస్యం.. ఫ్యామిలీ డ్రామా.. యాక్షన్ దట్టించి తెలివైన సినిమాలు తీయగలడు. కానీ అతడు తెరకెక్కించినవి 200 కోట్ల రేంజు వరకూ వసూలు చేయగలవు. కానీ 500 కోట్లు లేదా 1000 కోట్లు వసూల్ చేసేంతగా సౌత్ సినిమా ఎదిగింది.
ముఖ్యంగా తెలుగు సినిమా స్టామినా ఆ రేంజులో ఉంది ఇప్పుడు. రాజమౌళి - ప్రశాంత్ నీల్- సుకుమార్ లాంటి దర్శకులు పాన్ ఇండియా సినిమాలతో సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ ఎలాంటి సినిమా చేయబోతున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. అతడు తెరకెక్కించే మూవీ మాస్ లో దుమ్ము దులిపే కంటెంట్ తోనే వస్తుందా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
మహేష్ తదుపరి పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేస్తున్నారు. అంతకంటే ముందే వచ్చే మూవీ కూడా పాన్ ఇండియా మూవీనే కావాలని అభిమానులు సూచిస్తున్నారు. త్రివిక్రమ్ గత చిత్రం `అల వైకుంఠపురములో` అంత హిట్టు చాలదు! అంతకుమించి అనేలా మ్యాసివ్ హిట్ ని అతడి నుంచి ఆశిస్తున్నారు. మహేష్ కెరీర్ లో తొలి 500 కోట్ల క్లబ్ సినిమాని తెరకెక్కించాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ త్రివిక్రమ్ ఎలాంటి మూవీని తీస్తున్నారు? అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.