Begin typing your search above and press return to search.
మళ్లీ త్రివిక్రమ్ మార్కు చూపించాడుగా..
By: Tupaki Desk | 7 Jan 2018 7:30 AM GMTప్రతి దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన శైలి.. అతడి సినిమాలో తనదైన ఒక ముద్ర అనేది ఉంటుంది. దర్శకుడిగా కంటే మాటల రచయితగా ఎక్కువ పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన ప్రతి సినిమాలో డైలాగుల్లో తన ప్రత్యేకత చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తన సినిమాలోని కథ సారాంశాన్ని ఒక డైలాగ్ తో చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ డైలాగ్ సినిమాలో చాలా బలంగా ఉండేలా ఫ్రేమ్ చేస్తాడు త్రివిక్రమ్. ఆ డైలాగ్ ప్రోమోల్లో కూడా హైలైట్ అవుతుంటుంది. ‘జల్సా’ సినిమాలో ‘యుద్ధంలో గెలవడం అంటే చంపడం కాదు. ఓడించడం’ అనే డైలాగ్ అలాంటిదే. ఈ డైలాగ్ నేపథ్యంలోనే సినిమా మొదలై.. దాంతోనే ముగుస్తుంది.
ఇక ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ‘‘మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు’’ అనే డైలాగ్ కూడా కూడా ఈ తరహాదే. ఆ డైలాగ్ నేపథ్యంలోనే కథ నడుస్తుంది. ఆ చిత్ర ట్రైలర్లో కూడా ఆ డైలాగ్ ను హైలైట్ చేశారు. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’లో కూడా ఇలా ఒక డైలాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక కుర్చీ తయారు చేయడం వెనుక ఎంత శ్రమ ఉంటుందో చెబుతూ.. చివరగా ‘‘జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుకా ఒక మినీ యుద్ధమే ఉంటుంది’’ అంటూ ముగిస్తాడు పవన్. ట్రైలర్ రిలీజవడం ఆలస్యం.. అందరి నోళ్లలో నానుతున్న డైలాగ్ ఇదే. సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరూ దాని ముందు ఈ లైన్సే రాస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ కథ కూడా దీని చుట్టూనే తిరుగుతుందేమో అనిపిస్తోంది. చూద్దాం మరి.