Begin typing your search above and press return to search.

ప్రేక్షక దేవుళ్ల పై త్రివిక్ర‌మ్‌ మాస్టారు క్లాస్

By:  Tupaki Desk   |   11 Jan 2020 9:52 AM GMT
ప్రేక్షక దేవుళ్ల పై త్రివిక్ర‌మ్‌ మాస్టారు క్లాస్
X
ప్రేక్ష‌కులు ఏ సినిమాని హిట్టు చేస్తారో.. ఏ సినిమాని ఫ్లాప్ చేస్తారో ఎవ‌రూ ఊహించ‌లేరు. ఆ మాట కొస్తే సినిమా తీసే ప్ర‌తి ఒక్క‌రూ ప్రేక్ష‌క దేవుళ్ల‌ను మెప్పించాల‌నే ప‌ట్టుద‌ల‌ తోనే హార్డ్ వ‌ర్క్ చేస్తారు. కానీ చివ‌రిలో ఫ‌లితం తేడా వ‌స్తేనే భేజారైపోతారు. అస‌లు ఆడియెన్ ప‌ల్స్ ప‌ట్టుకునేందుకు ఏదైనా మీట‌ర్ ఉందా? అస‌లు ఏమిటి కొల‌మానం? అంటే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ నోటి నుంచి జాలు వారిన‌ ఆణిముత్యాల్ని ఏరుకుంటే స‌రిపోతుందేమో!

సినిమా జ‌యాప‌జ‌యాల్ని నిర్ణ‌యించేది ఆడియెన్. అయితే ప్రేక్షకులు అభిమానించేది మనం చేసే ప‌నిని మాత్ర‌మే. మనల్ని కాదు. దాన్ని డిటాచ్ చేస్తేనే.. వాటినుంచి మనం విడిపోయి మనకు నచ్చిన పని చేసుకోగలం. లేకపోతే మరీ సీరియస్ అయిపోయి స్తబ్దతకు గురవుతాం. కాబట్టి సినిమా వరకు మనం ప్రజల ఇష్టాన్ని పరిగణ లోకి తీసుకోవాలి. చేసిన ఏ సినిమానైనా నచ్చలేదని తిర‌స్క‌రించారంటే.. అప్పటి వ‌ర‌కూ నేను చేసిన పని నేను చేసినట్లు కాదు. తర్వాత చేసే పని కూడా నేను చేసేది కాదు. ఆ క్షణానికి వాళ్లకు నచ్చదు అంతే!! అని అన్నారు.

ఇన్నేళ్ల అనుభవం తో ప్రేక్ష‌కుల మైండ్ సెట్ ని ఆయ‌న రివ్యూ చేసిన తీరు ఆస‌క్తిక‌రం. త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ.. ``ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటుంటాం. థియేటర్లో లైట్లు ఆర్పిన తర్వాత కులం- మతం- జాతి.. వీటన్నిటికీ అతీతంగా సినిమాని చూస్తారు. వాళ్లను ఏదీ ఆ టైంలో ప్ర‌భావితం చేయ‌దు. నవ్వొస్తే నవ్వుతారు.. ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు. ప్రేక్షక దేవుడంటే మనం తెలుసుకోవాల్సింది.. పొజిషన్ కాదు.. కండిషన్`` అని అన్నారు. సీనియారిటీతో అనుభ‌వ పూర్వ‌కంగా త్రివిక్రమ్ చెప్పిన ఈ విష‌యాల్లో కాస్త క‌వితాత్మ‌క‌త తాత్విక‌త ఉన్నా త‌త్వం యువ‌త‌రం ఫిలింమేక‌ర్స్‌ కి ఇది బోధ ప‌డితే చాలు. మునుముందు త‌ప్పు చేయ‌కుండా జాగ్ర‌త్తలు ఎలా తీసుకోవాలో అర్థ‌మ‌వుతుంది.