Begin typing your search above and press return to search.
సాంబార్ స్టార్ తో త్రివిక్రమ్ ఫిక్స్
By: Tupaki Desk | 27 Nov 2015 3:30 PM GMTస్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ టాలీవుడ్ లో ముగ్గురు హీరోలతో వరుసగా సినిమాలు తీస్తుంటాడు. పవన్ కల్యాణ్ - మహేష్ - బన్ని.. ఈ ముగ్గురు అతడికి ఆల్ టైమ్ ఆప్షన్. అయితే ఇటీవలే రూటు మార్చి హీరో నితిన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ కలయికలో అ.. ఆ ఆన్ సెట్స్ ఉందిప్పుడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ఏ హీరోతో పనిచేస్తాడు? .. దీనికి ఇంతకాలం సరైన జవాబు లేదు. మహేష్ కోసం కథ రెడీ చేశాడని, లేదు పవన్ తో సినిమా ఉంటుందని, చరణ్ కూడా లైన్ లో ఉన్నాడని ఇంతకాలం వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడే ఆన్సర్ అట్నుంచి వచ్చిందని చెప్పుకుంటున్నారు.
ఇటీవలే త్రివిక్రమ్ సాంబార్ ల్యాండ్ స్టార్ హీరో సూర్యని కలిసి కథ వినిపించాడు. తను ఓకే చెప్పాడు. ఇక ప్రస్తుతం అతడు నటిస్తున్న సినిమా పూర్తయితే త్రివిక్రమ్ కి కాల్షీట్లు కేటాయించడానికి సిద్ధమేనని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ అ.. ఆ సినిమాతో బిజీ. సూర్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24 మూవీతో బిజీ. ఇవి రెండూ పూర్తయి రిలీజైపోయాక.. ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ కెళ్లే ఛాన్సుందన్నది తాజా అప్ డేట్. ఈ సినిమాని ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తారన్నది మరో అప్ డేట్. ఇప్పటికే రాధాకృష్ణ సూర్యకి అడ్వాన్స్ కూడా చెల్లించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మించే చిత్రమిదని చెబుతున్నారు.