Begin typing your search above and press return to search.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో అ..ఆ.. ఆడియో
By: Tupaki Desk | 28 April 2016 9:54 AM GMTకూటి కోసం కోటి విద్యలు టైప్ లో.. పబ్లిసిటీ కోసం బోలెడు పద్ధతులు ఫాలో అవాల్సి వస్తోంది. ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్టులను పరిచయం చేయడంలో.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దిట్ట. ఒక్కో కేరక్టర్ ని పరిచయం చేస్తూ.. ఇంట్రెస్ట్ కలిగించడం అనే పద్ధతి బాహుబలితో బాగా ఫేమస్ అయింది కానీ.. నిజానికి దీన్ని సన్నాఫ్ సత్యమూర్తితో త్రివిక్రమ్ ముందే దారి చూపించాడు.
ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ ను తన లేటెస్ట్ మూవీ అ..ఆ.. కోసం సిద్ధం చేశాడట మాటల మాంత్రికుడు. నితిన్ - సమంత జంటగా నటించిన అ..ఆ.. ఇప్పుడు తుది దశకు చేరుకుంది. మే 2న గ్రాండ్ లెవెల్ లో ఆడియో ఫంక్షన్ నిర్వహించబోతోంది యూనిట్. సిటీలో స్థిరపడ్డ ఫ్యామిలీ - పల్లెటూరిలోనే జీవిస్తున్న కుటుంబం మధ్య ఏర్పడే సామాజిక అంతరాలనే పాయింట్ గా తీసుకుని అ.. ఆ.. మూవీని రూపొందించాడు త్రివిక్రమ్. ఈ విషయం అందరికీ అర్ధమయ్యేలా విభిన్నంగా ఆడియో లాంఛ్ కార్యక్రమం ఉండనుందట.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా త్రివిక్రమ్ దగ్గరుండి పర్యవేక్షిస్తుండడం విశేషం. అనసూయ రామలింగ్ వర్సెస్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఊపందుకున్నాయి. మే నెలలోనే సరైన డేట్ చూసుకుని విడుదలకు ప్లాన్ చేయనున్నారు.