Begin typing your search above and press return to search.
దేవిశ్రీతో డౌటే.. అనిరుధ్ తో చేస్తాడట
By: Tupaki Desk | 10 Oct 2018 5:30 PM GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారాక ఎక్కువ సినిమాలు చేసింది దేవిశ్రీ ప్రసాద్‌తోనే. తొలి సినిమా ‘నువ్వే నువ్వే’కు కోటితో, రెండో సినిమా ‘అతడు’కి మణిశర్మతో మ్యూజిక్ చేయించుకున్న త్రివిక్రమ్.. తర్వాత ‘జల్సా’ దగ్గర దేవితో కనెక్టయ్యాడు. ఆ ఆడియో సూపర్ హిట్ అయింది. ఆపై వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘జులాయి’.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలొచ్చాయి. ఈ ఆడియోలు కూడా హిట్టే. దీంతో దేవి త్రివిక్రమ్ కు ఆస్థాన సంగీత దర్శకుడు అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ‘అఆ’ సినిమాకు దేవిని పక్కన పెట్టాడు త్రివిక్రమ్. ఆ చిత్రానికి తమిళ సంగీత యువ సంచలనం అనిరుధ్ ను తీసుకోవాలని అనుకున్నాడు కానీ.. కుదర్లేదు. దీంతో మిక్కీ జే మేయర్ తో సర్దుకుపోయాడు. అతనెంత మంచి మ్యూజిక్ ఇచ్చినప్పటికీ తర్వాతి సినిమాకు మాత్రం కంటిన్యూ చేయలేదు.
‘అజ్ఞాతవాసి’కి పట్టుబట్టి అనిరుధ్ తో మ్యూజిక్ చేయించుకున్నాడు. ఈ ఆడియోకు మంచి రెస్పాన్సే వచ్చినప్పటికీ సినిమా ఆడకపోవడంతో నెగెటివ్ ఎఫెక్ట్ పడింది. ఆల్రెడీ ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ ను ఓకే చేసిన త్రివిక్రమ్.. అనివార్య పరిస్థితుల్లో అతడిని తప్పించి తమన్ ను తీసుకున్నాడు. ఇందులో ఎన్టీఆర్ ప్రమేయం ఉందని అంటారు. ఐతే త్రివిక్రమ్ మళ్లీ అనిరుధ్ తో పని చేస్తాడా లేదా అన్న సందేహాలున్నాయి జనాల్లో. దీనికి త్రివిక్రమ్ జవాబిచ్చాడు. తెలుగు సినిమా సంగీతాన్ని అనిరుధ్ అర్థం చేసుకోవడానికి.. అనిరుధ్ ను తాను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుందని.. అందుకే ‘అరవింద సమేత’కు అతడిని వద్దనుకున్నానని చెప్పాడు. అనిరుధ్ తనకు చాలా ఇష్టమైన సంగీత దర్శకుడని.. అతడితో మళ్లీ తప్పకుండా పని చేస్తానని త్రివిక్రమ్ స్పష్టం చేశాడు. మరి దేవిశ్రీని ఎందుకు పక్కన పెట్టారని అడిగితే.. తమ మధ్య గ్యాప్ ఏమీ లేదని.. ఇప్పటికీ టచ్ లో ఉన్నామని.. ఐతే తనను తాను కొత్తగా కనుక్కునే ప్రయాణంలో మిగిలిన వాళ్లతో ప్రయాణం చేస్తుంటానని అన్నాడు. ఐతే దేవి గురించి అంతా బాగానే మాట్లాడాడు కానీ.. అనిరుధ్ విషయంలో చెప్పినట్లు అతడితో మళ్లీ పని చేస్తానని మాత్రం అనలేదు త్రివిక్రమ్.