Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ స్టోరీ మాయ.. అది సంగతి
By: Tupaki Desk | 7 Feb 2018 4:17 AM GMTయంగ్ హీరో నితిన్ తో.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అఆ అంటూ ఓ బ్లాక్ బస్టర్ మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. సమంత లీడ్ రోల్ అయినా.. ఆనంద్ విహారిగా నితిన్ మెప్పించిన తీరు అభినందించాల్సిందే. ఈ కుర్ర హీరోతో మరో సినిమా చేసేస్తున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయిపోయింది.
అయితే.. ఈ సారి త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం లేదంతే. తనే కథ రాసి అందించడమే కాదు.. నిర్మాణ భాగస్వాముల్లో కూడా ఒకడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రొడ్యూసర్ అనే విషయం తెలిసిందే. అందుకే ఈ చిత్రంపై అంతటా ఆసక్తి కనిపిస్తోంది. అయితే.. అజ్ఞాతవాసి నిరుత్సాహపరిచిన తర్వాత త్రివిక్రమ్ సామర్ధ్యంపై కొందరు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పైగా రీసెంట్ గా ఈ చిత్రం గురించి ఓ ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 12న ఫస్ట్ లుక్ ఇచ్చి.. ఫిబ్రవరి 14న.. ఈ లవ్ స్టోరీకి సంబంధించిన టీజర్ ను విడుదల చేస్తామని నితిన్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని నిర్ణయించారు.
కానీ.. రీసెంట్ గా ఈ మూవీ టీం ఇచ్చిన ప్రెస్ నోట్ లో ఎక్కడా త్రివిక్రమ్ పేరు లేకపోవడంపై.. రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ రైటర్ గా తన క్రెడిట్ వేసుకుని.. ఇప్పుడు యంగ్ టీమ్ నుండి అటెన్షన్ అంతా తనవైపు తిప్పుకోవడం ఇష్టం లేని మాటల మాంత్రికుడు.. ఉద్దేశ్యపూర్వకంగానే తన పేరును ప్రెస్ నోట్ నుంచి తీయించివేశాడని తెలుస్తోంది. అద్భుతమైన కథ ఇవ్వడంతో పాటు.. ఎలాగూ ప్రొడ్యూసర్ గా త్రివిక్రమ్ బ్రాండింగ్ ఉంటుంది కాబట్టి.. పేరు ఏసుకున్నా లేకపోయినా త్రివిక్రమ్ త్రివిక్రమే కదా.