Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ కూడా కాపాడలేకపోయాడే..
By: Tupaki Desk | 10 April 2015 1:30 PM GMTబ్రహ్మి పనైపోయిందంటూ కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో గట్టి ప్రచారమే జరుగుతోంది. అవకాశాలు తగ్గిపోయాయని ఓవైపు.. బ్రహ్మి కామెడీ పేలట్లేదని మరోవైపు.. చర్చించుకుంటున్నారు జనాలు. దీని గురించి బ్రహ్మానందం స్పందిస్తూ తాను ఇప్పటికీ రెండు షిఫ్టుల్లో పని చేస్తూ బిజీగా ఉన్నానని.. ఇలాంటి ప్రచారం కట్టిపెట్టాలని మీడియాతో అనడం కూడా జరిగింది. ఐతే బ్రహ్మి ఎంత బిజీగా ఉన్నాడు, ఆయన చేతిలో ఎన్ని సినిమాలున్నాయి అన్న సంగతి పక్కనబెడితే.. తెరమీద బ్రహ్మి కామెడీ పండి చాలా కాలమైందన్నది వాస్తవం. గత ఏడాది రేసుగుర్రం సినిమాలో కిల్ బిల్ పాండే క్యారెక్టర్ తర్వాత ఆ స్థాయిలో బ్రహ్మి ఇంపాక్ట్ వేసింది లేదు.
శ్రీను వైట్ల సినిమాలో బ్రహ్మి ఏం చేసినా కామెడీ పేలిపోయేది కానీ.. ఆశ్చర్యకరంగా 'ఆగడు'లో బ్రహ్మి క్యారెక్టర్ తేలిపోయింది. సినిమా ఫ్లాపవడానికి బ్రహ్మి క్యారెక్టర్ పండకపోవడం కూడా ఓ కారణమే. ఐతే గతంలో వైట్ల సినిమాల్లో అయినా అప్పుడప్పుడూ బ్రహ్మి కామెడీ డోస్ తగ్గి ఉండొచ్చు కానీ.. త్రివిక్రమ్ సినిమాల్లో మాత్రం బ్రహ్మి అదరగొట్టేసేవాడు. అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది.. ఇలా ప్రతి సినిమాలోనూ కేక పెట్టించే కామెడీ చేశాడు బ్రహ్మి. అందుకే 'సన్నాఫ్ సత్యమూర్తి' మీద బ్రహ్మితో పాటు ఆయన అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ బ్రహ్మి వేసిన పైడా క్యారెక్టర్ ఆశించిన స్థాయిలో పేలలేదు. 'అత్తారింటికి దారేది' స్టయిల్లోనే బ్రహ్మిని చివర్లో కొసమెరుపులా దించాడు త్రివిక్రమ్. ఇంట్రడక్షన్ బాగానే అనిపించింది కానీ.. ఆ తర్వాత బ్రహ్మి మామూలైపోయాడు. బ్రహ్మిని వాడేసుకుని హీరో గేమ్ ఆడడం, అతణ్ని చితకబాదడం మనకు కొత్తేం కాదు. దీంతో ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారు. మొత్తానికి త్రివిక్రమ్ కూడా బ్రహ్మితో కామెడీ చేయించలేని పరిస్థితి వచ్చేసిందన్నమాట.