Begin typing your search above and press return to search.

మిస్టేక్‌ చేశాను అనుకున్న త్రివిక్రమ్

By:  Tupaki Desk   |   28 May 2016 4:52 AM GMT
మిస్టేక్‌ చేశాను అనుకున్న త్రివిక్రమ్
X
చాలా సినిమాలు తీసేటప్పుడు దర్శకులకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. సరిగ్గా మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు కూడా అలాంటి సందేహాలే వచ్చాయట. పైగా ఎంత రేంజ్‌ సందేహం ఏంటంటే.. అసలు నితిన్‌ అండ్‌ సమంతను ఈ సినిమాలో ఒక పెయిర్‌ గా క్యాస్టింగ్‌ చేసి తప్పుచేశానా అనే డౌటు వచ్చిందట. ఎందుకలా?

అబ్బే.. తొలిరోజు షూటింగ్‌ మొదలు పెట్టగానే.. అసలు నితిన్‌ కాని సమంత కాని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదట. ఎప్పటినుండో ఇద్దరికీ పరిచయం ఉన్నా కూడా.. యాక్టింగ్‌ కాన్షియస్నెస్‌ వలన నేను మాట్లాడలేదు అని నితిన్‌ అంటుంటే.. తను నాతో మాట్లాడడం లేదు కాబట్టి నేనేమన్నా తనకు ఇష్టం లేని పనేమన్నా చేశానేమో అని సమంత అనుకుందట. వీరి గోల ఉన్నా.. ఇదంతా అక్కడ సీన్లు తీస్తున్న త్రివిక్రమ్ కు తెలియదుగా.. వీరి మధ్యన కెమిస్ర్టీ వర్కవుట్‌ కావట్లేదని ఆయనకు మానిటర్‌ చూస్తే అర్ధమైపోయింది. వెంటనే రెండు గంటల బ్రేక్‌ ఇచ్చాడట. ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి.. ఎందుకని మీరిద్దరూ సరిగ్గా చేయట్లేదు.. నేనేమన్నా మిస్టేక్‌ చేశానా మిమ్మల్ని ఇలా క్యాస్టింగ్‌ చేసి అన్నాడట.

అప్పుడు ఓపెన్ అప్ అయిన సమంత అండ్‌ నితిన్‌ లు.. ఆ రెండు గంటలూ గడిచాక.. ఇక చితక్కొట్టేశారు పో.